అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే జనవరి 7 ఈ పాటికి ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రీమియర్స్ టాక్, ప్రీమియర్ షో కలెక్షన్స్ రికార్డులు, ఇక్కడ ఫ్యాన్స్ స్పెషల్ షోల హంగామా, అడ్వాన్స్ బుకింగ్స్ జోరు ఇలా పండగ వారం ముందు నుండే ఓ రేంజ్ లో మొదలు అయ్యి ఉండేది కానీ 3rd వేవ్ ని ముందే ఊహించిన ఆర్ ఆర్ ఆర్ టీం సినిమాను వారం ముందే పోస్ట్ పోన్ చేస్తున్నామని…
అనౌన్స్ చేయగా ఈ రోజు రిలీజ్ డేట్ ని ఖాళీగా వదిలేస్తారు అనుకుంటే కొన్ని చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతున్నాయి. వాటిలో రానా దగ్గుబాటి నాకు సంభందం లేదని వదిలేసినా 1945 అనే సినిమా డైరెక్ట్ తెలుగు వర్షన్ లా కాకుండా తమిళ్ నుండి తెలుగు లో…
డబ్ అయ్యి రిలీజ్ అవుతున్న సినిమాగా వస్తూ ఉండగా కెరీర్ మొదట్లో ఎప్పుడో హిట్ కొట్టి మళ్ళీ ఒక్క హిట్ ని కూడా అందుకోలేక పోయిన సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ నటించిన అతిది దేవోభవ అనే సినిమా ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కాబోతున్నాయి…
రెండు సినిమాలు కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో డీసెంట్ థియేటర్స్ కౌంట్ తోనే రిలీజ్ కాబోతున్నాయి. 1945 మూవీ ఆల్ మోస్ట్ 350 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా అతిధి దేవోభవ సినిమా 330 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇక ఈ రెండు సినిమాలు అసలు ఈ రోజు రిలీజ్ అవుతున్నాయి అన్న విషయం కూడా చాలా తక్కువ మందికే తెలుసు అని చెప్పాలి.
ఈ రోజు ఆర్ ఆర్ ఆర్ ఓపెనింగ్ రికార్డులతో ఓపెన్ అవ్వాల్సింది ఈ రెండు సైలెంట్ రిలీజ్ లతో చాలా చప్పగా బాక్స్ ఆఫీస్ ఓపెన్ కాబోతుంది, దానికి తోడూ 3rd వేవ్ కూడా మొదలు అవ్వడం నిన్న ఒక్కరోజే 1,15,000 కి పైగా రిపోర్ట్ అవ్వడంతో సినిమాల మీద ఇంపాక్ట్ కూడా గట్టిగానే ఉండేలా ఉందని చెప్పాలి… ఈ వేవ్ ఎప్పటికి ఆగిపోతుందో చూడాలి.