Home న్యూస్ రంగరంగా వైభవంగా బిజినెస్, థియేటర్స్ కౌంట్…బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!!

రంగరంగా వైభవంగా బిజినెస్, థియేటర్స్ కౌంట్…బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!!

0

మొదటి సినిమా ఉప్పెనతోనే ఆల్ టైం ఇండియన్ డెబ్యూ హీరోల రికార్డ్ ను బ్రేక్ చేసిన పంజా వైష్ణవ్ తేజ్ ఆ సినిమాతో ఏకంగా 50 కోట్లకి పైగా షేర్ ని అందుకుని సంచలనం సృష్టించాడు. అలాంటి విజయం తర్వాత చేసిన ప్రయోగాత్మక సినిమా కొండ పొలం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ప్రయత్నంగా నిలిచినా కానీ కలెక్షన్స్ పరంగా ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించలేక చతికిల బడింది… ఇక ఈ సారి…

ఆడియన్స్ ముందుకు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రంగరంగా వైభవంగా అంటూ లవ్ స్టొరీ తో వచ్చేశాడు… కాగా ఈ సినిమా టీసర్ ట్రైలర్ మరీ అద్బుతం కాదు కానీ ఉన్నంతలో ఒకసారి చూడొచ్చు అనిపించే రేంజ్ కంటెంట్ తో వస్తున్న సినిమాలా అనిపించింది.

ఇక సినిమా ఓవరాల్ గా డీసెంట్ రిలీజ్ ను రీజనబుల్ వర్త్ బిజినెస్ ను సొంతం చేసుకుని ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఒకసారి సినిమా ఓవరాల్ గా రిలీజ్ అవుతున్న థియేటర్స్ కౌంట్ ని గమనిస్తే…
👉Nizam – 150~
👉Ceeded – 75~
👉Andhra – 220~
AP TG: 440~
👉KA+ROI – 60~
👉OS – 150+
Total WW – 650+
ఇదీ టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా రిలీజ్ అవుతున్న థియేటర్స్…

ఇక సినిమా కి ఓవరాల్ గా జరిగిన వర్త్ బిజినెస్ ట్రేడ్ లెక్కల్లో ఈ విధంగా ఉంది…
👉Nizam: 2.6Cr
👉Ceded: 1.3Cr
👉Andhra: 3.6Cr
AP-TG Total: 7.50Cr
👉Ka+ROI+OS: 1.00Cr
Worldwide: 8.50CR(Break Even – 9.00cr+)
ఇదీ ఓవరాల్ గా సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన వర్త్ బిజినెస్ లెక్క…. మొత్తం మీద చాలా రీజనబుల్ వర్త్ బిజినెస్ నే…

ఈ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మినిమమ్ 9 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ థియేటర్స్ కౌంట్ తో రీజనబుల్ బిజినెస్ తో వస్తున్న ఈ సినిమా ఎంతవరకు అంచనాలను తట్టుకుని విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here