బాక్స్ ఆఫీస్ దగ్గర డిసెంబర్ 20 న మొత్తం మీద 4 సినిమాలు క్లాష్ అవ్వగా అందులో 2 క్రేజీ తెలుగు సినిమాలు ఉండగా రెండు సినిమాలకు ఓపెనింగ్స్ వరకు మంచి కలెక్షన్స్ దక్కినా కానీ తర్వాత రోజు నుండి ఒక సినిమా జోరు చూపుతూ దూసుకు పోగా మరో సినిమా మాత్రం మినిమమ్ కలెక్షన్స్ ని కూడా అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిల బడింది. ఆ సినిమాలే ప్రతీరోజూ పండగే మరియు రూలర్ లు.
2 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజులను పూర్తీ చేసుకోగా ప్రతీరోజూ పండగే ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ తో దూసుకు పోతుంది, అదే సమయం లో రూలర్ ఫ్యాన్స్ ఫస్ట్ డే చూడటం తో ఓపెనింగ్స్ దక్కినా కామన్ ఆడియన్స్ రెండో రోజు నుండి పెద్దగా రావడం లేదు.
ఇక 6 వ రోజు రెండు సినిమాలకు క్రిస్టమస్ హాలిడే అడ్వాంటేజ్ ఉన్నా కానీ ఉన్నంతలో ప్రతీరోజూ పండగే సినిమా సాలిడ్ గా ఈ అడ్వాంటేజ్ ని వాడుకుంటూ దూసుకు పోతుంది, సినిమా 5 వ రోజు తో పోల్చితే బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజు మార్నింగ్ అండ్ నూన్ షోలకు కేవలం 10% లోపు డ్రాప్స్ ని సొంతం చేసుకుంది.
ఇక రూలర్ పరిస్థితి మరింత కష్టంగా మారిపోయింది, సినిమా 5 వ రోజు తో పోల్చితే 6 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 20% కన్నా ఎక్కువ డ్రాప్స్ నే రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. దాంతో మొత్తం మీద రెండు సినిమాలలో ఈవినింగ్ అండ్ నైట్ షోలలో ప్రతీ రోజు పండగే జోరు చూపడం ఖాయంగా కనిపిస్తుండగా..
రూలర్ ఎంతవరకు గ్రోత్ ని అందుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది, మొత్తం మీద రూలర్ అన్నీ అనుకున్నట్లు జరిగితే 25 లక్షల నుండి 30 లక్షల రేంజ్ లో షేర్ ని, ప్రతీరోజూ పండగే 1.7 కోట్లకు పైగా షేర్ ని అందుకునే అవకాశం ఎక్కువగా ఉంది. మరి డే ఎండ్ సమయానికి 2 సినిమాల స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి.