థియేటర్స్ రీ ఓపెన్ చేసుకోవచ్చు అంటూ పర్మీషన్ లు ఇచ్చినా కానీ చాలా వరకు థియేటర్స్ ఇంకా తెరచు కోలేదు, సింగిల్ స్క్రీన్స్ అయితే టోటల్ గా మూసేసే ఉన్నాయి, కొన్ని చోట్ల మల్టీ ప్లేక్సులు తెరచు కున్నా ఓల్డ్ సినిమా లే దిక్కు అయ్యాయి, ఇలాంటి సమయం లో మరికొంత కాలం ఇదే పరిస్థితి ఉండేలా కనిపిస్తుండగా ఇంకా కొన్ని సినిమాలు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ వైపే మొగ్గు చూపుతున్నాయి.
వాటిలో సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా కూడా ఒకటి, ఈ సినిమా కు మొదటి నుండి మంచి డిజిటల్ రిలీజ్ ఆఫర్లు దక్కాగా యూనిట్ వెయిట్ చేస్తూ వచ్చింది, ఇక రీసెంట్ గా అన్ని డిజిటల్ యాప్స్ కన్నా….
బెటర్ ఆఫర్ ఇచ్చిన జీ 5 వాళ్ళు తర్వాత జీ ప్లెక్స్ లో సినిమా ను పే పెర్ వ్యూ పద్దతిలో రిలీజ్ చేస్తాం అంటూ అప్రోచ్ అవ్వగా 2 సినిమాల రిజల్ట్ కోసం ఎదురు చూసిన టీం ఇప్పుడు ఆ 2 సినిమాల రిజల్ట్ చూసి ఎటూ తేల్చుకోలేక పోతుంది, ఖాళీ పీలి మరియు రణసింగం సినిమాలు…
రెండూ కూడా పే పెర్ వ్యూ పద్దతిలో రిలీజ్ అవ్వగా ఒకటి ఊహకందని డిసాస్టర్ అవ్వగా మరోటి కలెక్షన్స్ ని సాధించినా అది సినిమా బడ్జెట్ రేంజ్ ని రికవరీ చేసే విధంగా సాధించలేదు. దాంతో ఈ రెండు సినిమాలలో ఒక సినిమాని చూస్తె టికెట్ సేల్స్ బాగానే జరుగుతాయేమో అన్న ధైర్యం వస్తూనే ఎక్కడ సినిమా…
ఖాళీ పీలి లాంటి రిజల్ట్ ని సొంతం చేసుకుంటుందో అన్న డౌట్ లో సాయి ధరం తేజ్ అలాగే టీం ఉన్నారట. దానికన్నా థియేటర్స్ లో పరిస్థితులు సద్దుకున్నాకే రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా చేస్తున్నారని తెలుస్తుంది, త్వరలోనే సినిమా పై ఎదో ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉందని సమాచారం…