Home గాసిప్స్ సాయి ధరం తేజ్ కొత్త సినిమా బడ్జెట్ అన్ని కోట్లు ఏంటి సామి!

సాయి ధరం తేజ్ కొత్త సినిమా బడ్జెట్ అన్ని కోట్లు ఏంటి సామి!

0

కెరీర్ మొదలు పెట్టడం హాట్రిక్ విజయాలతో మొదలు పెట్టిన మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ తర్వాత మాత్రం హాట్రిక్ ఫ్లాఫ్స్ తో కుదేలు అయ్యాడు, అయినా కానీ లాస్ట్ ఇయర్ రెండు సూపర్ హిట్స్ తో జోరు చూపిన సాయి ధరం తేజ్ చిత్రలహరి, ప్రతీ రోజూ పండగే సినిమాలతో మళ్ళీ ఫామ్ అందుకోగా త్వరలోనే సోలో బ్రకుటే సో బెటర్ సినిమా తో రాబోతుండగా ఈ సినిమా తర్వాత…

సాయి ధరం తేజ్ చేస్తున్న సినిమా ప్రీ లుక్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా అందరిలోనూ భారీ ఆసక్తిని రేపింది ఈ సినిమా..సుకుమార్ కథ స్క్రీన్ ప్లే అందిస్తున్న కొత్త కథను BVSN ప్రసాద్ నిర్మిస్తుండగా తన కెరీర్ లో 15 వ సినిమాగా వస్తున్న ఈ సినిమా కు కొత్త డైరెక్టర్ అయిన కార్తిక్ వర్మ డైరెక్షన్ చేయబోతున్నాడు.

ఈ సినిమా కాన్సెప్ట్ ఒక మిస్టరీ నేపధ్యంలో ఉంటుందని రివీల్ చేయగా సినిమా గ్రాఫిక్స్ హంగులతో భారీ లెవల్ లో ఈ సినిమా ఉండబోతుంది అన్న టాక్ లేటెస్ట్ గా వినిపిస్తుంది. ఇక ఈ సినిమా బడ్జెట్ కూడా భారీ లెవల్ లో ఉంటుందని అంటున్నారు.

ట్రేడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా కి సుమారు 35 కోట్లకు పైగానే బడ్జెట్ అయ్యే అవకాశం అవకాశం ఉందని అంటున్నారు, కథ మీద ఉన్న నమ్మకమే ఈ రేంజ్ లో బడ్జెట్ కి కారణం అన్న టాక్ వినిపిస్తుంది, ఇదే కనుక నిజం అయితే తన కెరీర్ లో ఇదే హైయెస్ట్ బడ్జెట్ మూవీ అని చెప్పాలి.

రీసెంట్ గానే ప్రతీ రోజూ పండగే తో 34 కోట్ల మార్క్ ని అందుకున్న సాయి ధరం తేజ్ తన మార్కెట్ ని బాగానే ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు. ఈ సినిమా కనుక వర్కౌట్ అయితే తన రేంజ్ మరింత పెరగడం ఖాయమని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా పై మరిన్ని విశేషాలు తెలిసే అవకాశం ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here