సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ కెరీర్ ని సాలిడ్ గా స్టార్ట్ చేసి వరుస హిట్స్ తో దుమ్ము లేపినా కానీ తర్వాత డబుల్ హాట్రిక్ ఫ్లాఫ్స్ తో ఎంత త్వరగా పికప్ అయ్యాడో అంతే త్వరగా బాక్స్ ఆఫీస్ దగ్గర మార్కెట్ ని కోల్పోవాల్సి వచ్చింది. అలాంటి టైం లో చిత్రలహరి తో మంచి కంబ్యాక్ ఇచ్చినప్పటికీ నికార్సయిన బ్లాక్ బస్టర్ ని మాత్రం మారుతి డైరెక్షన్ లో…
చేసిన ప్రతీ రోజూ పండగే సినిమా తో సొంతం చేసుకున్న సాయి ధరం తేజ్, ఈ సినిమా తర్వాత ఆడియన్స్ ముందుకు అన్నీ అనుకున్నట్లు జరిగితే మే 1 న సోలో బ్రతుకే సో బెటర్ సినిమా తో రావాల్సింది. లాక్ డౌన్ ముందు కేవలం 10% మాత్రమె సినిమా…
షూటింగ్ బాలెన్స్ ఉండగా కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ ఆగిపోయింది. కాగా ఈ ఏడాది ఎండ్ వరకు పరిస్థితులు సెట్ అయ్యేలా కనిపించడం లేదు కాబట్టి డైరెక్ట్ రిలీజ్ కోసం కొన్ని పెద్ద OTT యాప్స్ ఈ సినిమా యూనిట్ ని కూడా సంప్రదించి తమకి తోచిన రేంజ్ ఆఫర్స్ ఇచ్చాయట.
వాటిలో అతి పెద్ద ఆఫర్ గా 24 కోట్ల రేంజ్ ఆఫర్ డీల్ చేయడానికి ఒక బిగ్ స్ట్రీమింగ్ యాప్ సిద్ధం అయినట్లు సమాచారం. ప్రతిరోజూ పండగే 18 కోట్ల రేంజ్ బిజినెస్ మాత్రమె చేసింది, ఆ సినిమా తో పోల్చితే ఇది సాలిడ్ డీల్ అనే చెప్పాలి. కానీ మేకర్స్ అండ్ హీరో మాత్రం ఈ డీల్ పై ఏమాత్రం ఇష్టం లేదని చెప్పారట.
లేట్ అయినా కానీ ఈ ఇయర్ ఎండ్ లో లేక వచ్చే ఇయర్ మొదట్లో రిలీజ్ చేసుకుంటాం కానీ సినిమాను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేసే ఆలోచన లేదని చెప్పారట. దాంతో కొంత టైం తీసుకుని మరో బెటర్ ఆఫర్ తో రావాలని OTT యాప్స్ ట్రై చేస్తున్నాయని సమాచారం.