బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా, అన్ని చోట్లా దుమ్ము లేపే రేంజ్ లో జోరు చూపిస్తూ ఉండగా వీకెండ్ లోనే సినిమా అనేక సినిమాల రికార్డులను బ్రేక్ చేసి ఊహకందని బెంచ్ మార్క్ లను సెట్ చేస్తూ దూసుకు పోతుంది.
కాగా ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిమార్కబుల్ ట్రెండ్ ను చూపెడుతూ 800 కోట్లకు పైగా గ్రాస్ ను వీకెండ్ లోనే అందుకుని మాస్ రచ్చ చేసింది…కాగా తెలుగు సినిమాల పరంగా ప్రతీ నెలలో హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాల పరంగా ఇప్పుడు డిసెంబర్ నెలకి గాను…
పుష్ప2 మూవీ ఎపిక్ కలెక్షన్స్ తో కొత్త రికార్డ్ ను నమోదు చేసి డిసెంబర్ నెల రికార్డ్ ను నమోదు చేసింది. ఇది వరకు డిసెంబర్ నెలలో పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన సలార్(Salaar Movie) టోటల్ రన్ లో 630 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా…
ఇప్పుడు ఈ కలెక్షన్స్ ని కేవలం వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ తో బ్రేక్ చేసిన పుష్ప2 మూవీ ఇప్పుడు కొత్త రికార్డ్ ను భారీ మార్జిన్ తో నమోదు చేయడానికి సిద్ధం అవుతుంది…ఒకసారి టాలీవుడ్ మూవీస్ పరంగా ప్రతీ నెలలో హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న టాప్ మూవీస్ ని గమనిస్తే…
Telugu Highest Share Movies (Month Wise)
👉Jan- #AVPL/#HANUMAN(Gross)
👉Feb- #BheemlaNayak
👉Mar- #RRR
👉Apr- #Baahubali2
👉May- #SarkaruVaariPaata
👉Jun- #Kalki2898AD
👉Jul- #Baahubali
👉Aug- #Saaho
👉Sep- #Devara
👉Oct- #SyeRaa
👉Nov- #Damarukam
👉Dec- #Pushpa2TheRule******
ఇవి మొత్తం మీద ప్రతీ నెలలో హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన సినిమాలు….అన్ని నెలల్లో షేర్ అండ్ గ్రాస్ పరంగా ఒకే సినిమా టాప్ లో ఉండగా ఒక్క జనవరిలో మాత్రం షేర్ పరంగా అల వైకుంఠ పురంలో టాప్ లో ఉంటే గ్రాస్ పరంగా హనుమాన్ మూవీ టాప్ లో నిలిచాయి…. ఇక వచ్చే ఏడాది ఈ లిస్టులో పాత సినిమాల ప్లేస్ లో ఎన్ని కొత్త సినిమాలు వస్తాయో చూడాలి. ఇక డిసెంబర్ లో పుష్ప2 నమోదు చేసిన మమ్మోత్ రికార్డ్ బ్రేక్ అవుతుందో లేదో చూడాలి.