ఈ కరోనా ఎఫెక్ట్ వలన అందరికీ తీవ్ర ఇబ్బందులు జరుగు తుండగా సినీ ఇండస్ట్రీ కి కూడా భారీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. కొన్ని క్రేజ్ ఉన్న సినిమాలు ఎలాగోలా డిజిటల్ ఆఫర్స్ తో నెట్టుకు వస్తున్నాయి కానీ చాలా సినిమాలకు మాత్రం ఇది బాగా ఇబ్బంది పెడుతుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఏడాది అప్పుడే సగం పూర్తీ అయ్యి రెండో సగం లో కూడా మనం అడుగు పెట్టేశాం.
ఈ ఇయర్ స్టార్ట్ అవ్వడం ఎంత అద్బుతంగా స్టార్ట్ అయిందో ఇయర్ మొత్తం అలాగే కొనసాగుతుందేమో అని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు…క్రికెట్ మ్యాచ్ ని తలపిస్తూ ఓపెనర్లు సెంచరీలతో చెలరేగిపోయారు… సరిలేరు నీకెవ్వరు అలాగే అల వైకుంఠ పురంలో సినిమా లు బాక్స్ ఆఫీస్ దగ్గర…
100 కోట్లకు పైగా షేర్లు అందుకుని సంచలనం సృష్టించగా ఫస్ట్ డౌన్ అండ్ సెకెండ్ డౌన్ లో వచ్చిన భీష్మ అండ్ హిట్ సినిమాలు కూడా ఓపెనర్ల జోరు ని కొనసాగించాయి. కానీ తర్వాత కరోనా అనే నిరవదిక వర్షం వచ్చి మ్యాచ్ ని ఆపేసినట్లు సినిమాలు కరోనా ఎఫెక్ట్ తో రిలీజ్ కి నోచుకోవడం లేదు.
ఈ ఎఫెక్ట్ ఈ ఏడాది చివరి వరకు కొనసాగే అవకాశం ఎంతైనా ఉండగా కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయో లేదో అన్న డౌట్ కూడా కొనసాగుతుంది… ఈ ఏడాది సమ్మర్ ని టార్గెట్ చేసి చాలా సినిమా లు రిలీజ్ ఉన్నప్పటికీ వాటిలో చాలా సినిమా లు ఇప్పుడు ఈ ఇయర్ ఎండ్ వరకు ఆడియన్స్ ముందుకు….
రావాలని ట్రై చేస్తున్నాయి… కానీ అప్పటికి నికార్సయిన వాక్సిన్ లు రావడం కష్టమే అని కూడా అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం వరకు ఉన్న పరిస్థితులు చూస్తె మట్టుకు ఓపెనర్లు సెంచరీలు కొట్టిన తర్వాత మ్యాచ్ కరోనా వల్ల రద్దు అయింది అని చెప్పుకోవడానికే ఎక్కువ అవకాశం కనిపిస్తుంది అని చెప్పాలి…