టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్టర్ గానే కాకుండా కొన్ని సినిమాలకు ఫైట్స్ ని తానె స్వంతంగా కంపోజ్ చేసుకున్నాడు, ఇక జానీ సినిమాకు తానె స్వయంగా కథని రాసుకుని డైరెక్ట్ కూడా చేశాడు, తర్వాత కూడా ఒకటి రెండు సినిమాలకు కథలను రాసిన పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా తో సంచలన విజయం సొంతం చేసుకున్న తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కి కథ తానె రాసుకున్నాడు…
చాలా కష్టపడి రెండేళ్ళు రాసిన సర్దార్ గబ్బర్ సింగ్ రిజల్ట్ ఎలా వచ్చిందో అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా తొలిరోజు భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్నా తరువాత చల్లబడి టోటల్ గా 53 కోట్లలోపు తన బాక్స్ ఆఫీస్ రన్ ను ముగించింది.
కానీ ఈ సినిమా హైప్ అప్పట్లో మరో లెవల్ లో ఉండేది, అంచనాలను అందుకుని ఉంటే సినిమా లెక్క మరో రేంజ్ లో ఉండేది కానీ అంచనాలను తప్పింది…. కాగా చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే… ఈ సినిమాకు ముందు అనుకున్న స్టోరీ ఇది కాదని అంటున్నారు. ముందు అనుకున్న స్టోరీలో పవన్ డ్యూయల్ రోల్ ఉందట….
ఓ పవర్ ఫుల్ సర్దార్ పోలిస్ రతన్ పూర్ లో విలన్ల బెండు తీస్తూ అందరినీ కాపాడుతుండగా అనుకోకుండా ఒక యాక్సిడెంట్ లో కోమా లోకి వెళతాడట. తరువాత ప్రజలని కాపాడటానికి సర్దార్ పోలికలతో ఉండే గబ్బర్ సింగ్ ని రతన్ పూర్ కి రప్పిస్తారట, తరువాత గబ్బర్ సింగ్ తనదైన స్టైల్ లో అల్లరి చేస్తూ విలన్ల బెండు తీస్తూ ఉండగా సర్దార్ వేరే ఉన్నాడని తెలుస్తుందట.
తరువాత ఇద్దరూ కలిసి విలన్ల బెండు ఎలా తీశారు అన్నది మొదటి వర్షన్ కథ అట. ఆ కథ కోసమే పవన్ కళ్యాణ్ జుట్టు మరియు గడ్డం పెంచాడు, కానీ ఏమైందో తెలియదు కానీ కథను మార్చి సోలో రోల్ చేయడానికి సిద్ధమయ్యి కథని మార్చి రెండో వర్షన్ ని తెరకెక్కించాడు అంటున్నారు. మరి మొదటిది చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కదా….కమెంట్ సెక్షన్ లో మీ థాట్స్ చెప్పండి.