Home న్యూస్ సర్కార్ డే 1 కలెక్షన్స్…రికార్డులు గల్లంతు

సర్కార్ డే 1 కలెక్షన్స్…రికార్డులు గల్లంతు

0

  ఇళయ ధలపతి విజయ్ మరియు మురగదాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ సర్కార్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున 3400 థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. సినిమా కి అడ్వాన్స్ బుకింగ్స్ జోరు అదిరిపోయే రేంజ్ లో ఉండటం తో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఓపెనింగ్స్ రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో ఉందని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాలలో కూడా విజయ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది.

కాగా ఈవినింగ్ అండ్ నైట్ షోల లో సినిమా మరీ అద్బుతమైన గ్రోత్ ని సొంతం చేసుకోకున్నా ఉన్న బుకింగ్స్ స్టేటస్ ని కొనసాగిస్తూ రోజుని ముగించనుంది. దాంతో తెలుగు రాష్ట్రాలలో సినిమా కలెక్షన్స్ 1.7 కోట్ల రేంజ్ లోనే ఉండబోతున్నాయి.

ఇక తమిళనాడు లో ఇండస్ట్రీ రికార్డ్ లెవల్ లో 14 కోట్ల రేంజ్ లోనూ, కేరళలో 3 కోట్లకు పైగా, కర్ణాటకలో 3.5 కోట్లకు పైగా ఇక ఓవర్సీస్ 10 కోట్ల రేంజ్ లో సినిమా కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. నైట్ షోల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి ఈ లెక్క పెరగడమో తగ్గదమో జరుగుతుంది అంటున్నారు. మొత్తం మీద మొదటి రోజు కలెక్షన్స్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసే రేంజ్ లో ఉండబోతున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here