Home న్యూస్ సర్కార్ టోటల్ బిజినెస్..ఇండస్ట్రీ రికార్డ్

సర్కార్ టోటల్ బిజినెస్..ఇండస్ట్రీ రికార్డ్

0

  కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ ధలపతి విజయ్ ఏ ఆర్ మురగదాస్ ల కాంబినేషన్ లో వస్తున్న సెన్సేషనల్ మూవీ సర్కార్. అత్యంత భారీ అంచనాల నడుమ మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సెన్సేషనల్ మూవీ ఓవరాల్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కోలీవుడ్ తో పాటు సౌత్ ఇండస్ట్రీ లో నాన్ బాహుబలి మరియు నాన్ రజినీ మూవీస్ పరంగా రికార్డుల వర్షం కురిపించింది.

సినిమా తమిళనాడు లో 80 కోట్ల బిజినెస్ ని, తెలుగు రాష్ట్రాలలో 7.5 కోట్ల బిజినెస్ ని, కర్ణాటక లో 8 కోట్ల బిజినెస్ ని, కేరళలో 7.5 కోట్ల బిజినెస్ ని రెస్ట్ ఆఫ్ ఇండియా 1 కోటి బిజినెస్ ని టోటల్ ఓవర్సీస్ లో 30 కోట్ల బిజినెస్ ని సాధించింది.

దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 134 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ని సాధించింది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి మినిమమ్ 135 కోట్లకు పైగా షేర్ ని 260 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకోవాల్సి ఉంటుంది. మరి సినిమా దీపావళి వీకెండ్ లో ఎలాంటి భీభత్సం సృష్టిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here