Home న్యూస్ సర్కార్ రివ్యూ…పారిపొండిరోయ్

సర్కార్ రివ్యూ…పారిపొండిరోయ్

0
-advertisement-

        తుపాకి, కత్తి లాంటి రెండు బ్లాక్ బస్టర్స్ తర్వాత ఇళయ ధలపతి విజయ్ మరియు మురగదాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ సర్కార్ పై స్కై హై అంచనాలు ఉన్నాయి, ఆ అంచనాలకు తగ్గట్లే రికార్డ్ లెవల్ బిజినెస్, రికార్డ్ లెవల్ రిలీజ్ ని సొంతం చేసుకుంది సర్కార్ సినిమా. ఓవర్సీస్ లో పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్నా ఓవరాల్ గా రెగ్యులర్ షోల టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ.

-advertisement-

స్టోరీ లైన్: ఫారన్ లో బాగా డబ్బు సంపాదించిన బిజినెస్ మాన్ సుందర్ తన ఓటు హక్కు ని వినియోగించుకోవడానికి ఇండియా తిరిగి వస్తాడు. కానీ అప్పటికే తన ఓటు వేరే వాళ్ళు వేసేశారు అని తెలుసుకుని కోపంతో టోటల్ ఎలక్షన్స్ కాన్సిల్ అయ్యేలా చేస్తాడు.

-advertisement-

-advertisement-

-advertisement-

తాను కూడా ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నట్లు ప్రకటిస్తాడు.. తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా కథ. విజయ్ కి పాలిటిక్స్ లో త్వరలోనే చేరబోతున్నాడు అన్నది టాక్. దాని కోసమే ఇలా పోలిటికల్ నేపధ్యం ఉన్న సినిమాను ఎంచుకున్నాడని అంతా అనుకున్నారు.

-advertisement-

  పెర్ఫార్మెన్స్: విజయ్ వన్ మ్యాన్ షో గా చెప్పుకోవచ్చు, యాక్షన్, మ్యానరిజమ్స్, యాక్టింగ్ ఇలా అన్నీ తానై సినిమాను నడిపించాడు. ఫ్యాన్స్ ఫైట్ సీన్స్ లో ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసే ఎలివేషన్స్ ఉన్నాయి. హీరోయిన్ కీర్తి సురేశ్ ది సినిమాలో గెస్ట్ రోల్ అని చెప్పాలి.

-advertisement-

విజయ్ మరియు కీర్తి సురేశ్ ల పెయిర్ బాగుందని చెప్పొచ్చు, కానీ సినిమాలో కీర్తి సురేశ్ అప్పుడప్పుడు అలా వచ్చి వెళుతూ ఉంటుంది, ఉన్నంతలో వరలక్ష్మి విలనిజం బాగుంది.. మిగిలిన పాత్రలు జస్ట్ ఒకే అనిపిస్తాయి. పూర్తిగా విజయ్ మీదే సినిమా నడుస్తుంది.

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్ అందించిన సంగీతం సొ సొ గా ఉన్నా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం కుమ్మెశాడు. ముఖ్యంగా హీరో ఎలివేషన్ సీన్స్ మాత్రం రెహమాన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ తో మరో లెవల్ లో ఎంజాయ్ చేసేలా ఉన్నాయని చెప్పొచ్చు.

సాంకేతిక వర్గం: క్యామరామెన్ పనితనం బాగుంది, విజువాల్స్ చాలా గ్రాండియర్ గా అనిపించాయి. ఇక ఎడిటింగ్ ఏమంత బాలేదు, చాలా సీన్స్ ని ఎడిటింగ్ లో తీసెసే విధంగా ఉన్నాయని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ కుమ్మెశాయి అని చెప్పాలి.

విశ్లేషణ: మురగదాస్ డైరెక్షన్ లో రీసెంట్ గా వచ్చిన స్పైడర్ లో కథ ఉంది కానీ హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ అస్సలు లేకపోవడం తో ఆ సినిమా ఫలితం పై అది తీవ్ర ప్రభావం చూపింది. అది గమనించిన మురగదాస్ కథ గురించి మరిచిపోయి కేవలం…

హీరోయిజం చూపిస్తే సినిమా నచ్చేస్తుంది అనుకుని తీసినట్లు ఉంది సర్కార్ సినిమా. విజయ్ ఫ్యాన్స్ ని ఆకట్టుకునే అంశాలు పెట్టినా కథ పాయింట్ కానీ అది ప్రేక్షకులకు కనెక్ట్ చేసే విధంగా మాత్రం స్క్రీన్ ప్లే రాసుకోవడంలో తీవ్రంగా విఫలం అయ్యాడు మురగదాస్.

ఫస్టాఫ్ వరకు ఎలాగోలా మెప్పించినా సెకెండ్ ఆఫ్ ఫ్లాట్ నరేషన్ తో చూస్తున్న ఆడియన్స్ కి బోర్ కొట్టేలా చేశాడు. తమిళ్ నేటివిటీ వల్ల అక్కడ ఆడియన్స్ కి కొంతవరకు ఊపిక ఉండే ఛాన్స్ ఉందేమో కానీ తెలుగు ఆడియన్స్ అంత ఓపికగా చూసే ధైర్యం లేదనే చెప్పాలి.

మెర్సల్ తో ఇండస్ట్రీ రికార్డులు కొట్టిన విజయ్ ని ఎలివేట్ చేసే సీన్స్ రాసుకున్నా కథ తుపాకి, కత్తి రేంజ్ లో పకడ్బందీ గా రాసుకోలేదు. దాంతో సినిమా కథ ఎటు నుండి ఎటో వెలుతున్న ఫీలింఫ్ కలిగింది. మొత్తానికి మురగదాస్ అంచనాలు అందుకోలేకపోయాడు అని చెప్పొచ్చు.

హైలెట్స్: విజయ్, ఫైట్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, ఇంటర్వెల్ సీన్
మైనస్: వీక్ స్టోరీ లైన్, సెకెండ్ ఆఫ్, మురగదాస్ డైరెక్షన్స్, సాంగ్స్
మొత్తం మీద సినిమా ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నా తెలుగు ఆడియన్స్ మనసు గెలిచే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పాలి, దాంతో సినిమాకి మేము ఇస్తున్న రేటింగ్ 2.25 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here