Home న్యూస్ సవ్యసాచి డే 1 ఓపెనింగ్స్…ఊచకోత

సవ్యసాచి డే 1 ఓపెనింగ్స్…ఊచకోత

0

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య చందు మొండేటి డైరెక్షన్ లో చేసిన లేటెస్ట్ మూవీ సవ్య సాచి బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వ గా ఓవర్సీస్ ప్రీమియర్ షోల తో సినిమా 1 లక్ష డాలర్స్ ని వసూల్ చేయగా రెండు తెలుగు రాష్ట్రాల లో మొదటి రెండు షోల సమయాని కి ఓవరాల్ ఆక్యుపెన్సీ సుమారు 52% నుండి 55% వరకు ఉందని సమాచారం. దాంతో కలెక్షన్స్ కూడా సాలిడ్ గా రానున్నాయి.

ఈవినింగ్ అండ్ నైట్ షోల కి కూడా సినిమా ఇదే రేంజ్ లో జోరు ని కొనసాగించడం ఖాయంగా కనిపిస్తున్న నేపధ్యంలో నైట్ షోల ఆక్యుపెన్సీ 60% ని దాటడం ఖాయంగా కనిపిస్తుంది. దాంతో మొదటి రోజు కలెక్షన్స్ కెరీర్ సెకెండ్ బెస్ట్ ఆల్ మోస్ట్ కంఫామ్ అయింది అని చెప్పాలి.

సినిమా మొదటి రోజు మినిమమ్ లో మినిమమ్ 5 కోట్ల నుండి 5.5 కోట్ల లోపు షేర్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తుండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ జోరు మరింత జోరుగా ఉంటే ఈ లెక్క మరింత పెరిగే అవకాశం కూడా ఉందని అంటున్నారు. మరి సినిమా రోజు ముగిసే సరికి ఎంతవరకు కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here