Home న్యూస్ ఇదే ఫైనల్….ఫైనల్ టాక్ ఇదే…

ఇదే ఫైనల్….ఫైనల్ టాక్ ఇదే…

0

     యంగ్ హీరో నాగ చైతన్య చందు మొండేటి ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ సవ్యసాచి బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి ప్రీమియర్ షోల కి పాజిటివ్ టాక్ ని రెగ్యులర్ షో లకి కూడా అలాంటి టాక్ నే సొంతం చేసుకుంది. ఇక ఈవినింగ్ షోల కి ఫ్యామిలీ ఆడియన్స్ మరియు కామన్ ఆడియన్స్ భారీ ఎత్తున థియేటర్స్ కి రావడం తో వాళ్ళ నుండి సినిమా కి ఇప్పుడు ఎలాంటి టాక్ వస్తుంది అనేది ఆసక్తిగా మారింది.

కాగా ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునే కామెడీ, సెంటిమెంట్ మరియు ఫ్యామిలీ సీన్స్ సినిమాలో ఉండటం, నాగ చైతన్య యాక్టింగ్ తో ఆకట్టుకోవడం తో ఫ్యామిలీ ఆడియన్స్ కి సినిమా బాగానే నచ్చినట్లు చెబుతున్నారు. సాంగ్స్ కూడా బాగున్నాయని అంటున్నారు వారు.

ఇక రెగ్యులర్ కామన్ ఆడియన్స్ కి మాత్రం కామెడీ మరీ నవ్వుల పూవులు పూయించకున్నా బాగుందని, స్టోరీ మాత్రం ప్రిడిక్ట్ చేసేలాగా ఉందని కంప్లైంట్ ఇస్తున్నారు. కానీ యాక్షన్ సీన్స్ అండ్ నాగ చైతన్య పెర్ఫార్మెంస్ తో సినిమా ను నిలబెట్టాడని అంటున్నారు.

మొత్తం మీద సినిమా అటు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇటు కామన్ ఆడియన్స్ నుండి కూడా పర్వాలేదు…ఈజీగా ఒకసారి చూడొచ్చు అన్న టాక్ ని సొంతం చేసుకుంది. మరి ఈ ప్రభావం సినిమా కలెక్షన్స్ పై గట్టిగానే పడుతుంది అని చెప్పాలి.

ఎందుకంటే దీపావళి సెలవులు వచ్చే వారం దాకా కొనసాగుతున్న నేపధ్యంలో కేవలం విజయ్ సర్కార్ నుండి మాత్రమే పోటీ ఉన్న ఈ సినిమాకి ఈ టాక్ వలన కచ్చితంగా మంచి వసూళ్లు దీపావళి వీకెండ్ వరకు కొనసాగడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here