Home న్యూస్ 1050….యువసామ్రాట్ సెన్సేషన్

1050….యువసామ్రాట్ సెన్సేషన్

0

  యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సవ్యసాచి మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. కాగా సినిమా నాగ చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ రిలీజ్ ని సొంతం చేసుకుంది. రెండు రాష్ట్రాలలో అలాగే వరల్డ్ వైడ్ గా కూడా అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ సినిమా సుమారు 1000 కి పైగా నే థియేటర్స్ లో రిలీజ్ కానుందట.

అందులో నైజాంలో 220 వరకు, ఆంధ్రా మరియు సీడెడ్ లలో 430 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కర్ణాటకలో 150 థియేటర్స్ లో, రెస్ట్ ఆఫ్ ఇండియా లో 100 థియేటర్స్ లో రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమా…

సుమారు 140 లోకేషన్స్ లో రిలీజ్ కానుందట. మొత్తం మీద వరల్డ్ వైడ్ గా ఈ సినిమా సుమారు 1050 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. మంచి అంచనాలు ఉన్నందున సినిమా కి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా దీపావళి సీజన్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here