Home న్యూస్ 0.9M టార్గెట్… ప్రీమియర్ షో కలెక్షన్స్ ఇవి!

0.9M టార్గెట్… ప్రీమియర్ షో కలెక్షన్స్ ఇవి!

0

  యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సవ్య సాచి బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవర్సీస్ ప్రీమియర్ షో లలో మంచి వసూళ్లనే సాధించింది. ముందుగా శైలజా రెడ్డి అల్లుడు ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలతో 1 లక్షా 7 వేల డాలర్స్ ని వసూల్ చేసింది. ఇక సవ్యసాచి సినిమా ఓవర్సీస్ మొత్తం మీద 3.5 కోట్లకు అమ్మడంతో సినిమా 0.9 మిలియన్ మార్క్ ని అక్కడ అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది..

ఇక ప్రీమియర్ షోలు మొత్తం మీద 130 లొకేషన్స్ లో జరగగా అందులో 90 లొకేషన్స్ లో సినిమా ఆల్ మోస్ట్ 92 వేల డాలర్స్ ని వసూల్ చేసింది. ఇక మిగిలిన లొకేషన్స్ లెక్కలు తేయాల్సి ఉండగా మొత్తం మీద సినిమా 1 లక్ష డాలర్స్ మార్క్ ని అందుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు.

దాంతో వర్కింగ్ వీకెండ్ సినిమా మంచి వసూళ్లనే ఓవర్సీస్ లో సాధించింది అని చెప్పాలి. ఇక శుక్రవారం, శని ఆదివారాల్లో సినిమా ఓవర్సీస్ లో జోరు కొనసాగిస్తే కచ్చితంగా మంచి వసూళ్లని అక్కడ సాధించే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక రెండు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here