Home న్యూస్ సవ్యసాచి రివ్యూ…హిట్టు బొమ్మ

సవ్యసాచి రివ్యూ…హిట్టు బొమ్మ

2

        యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా చందు మొండేటి డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన లేటెస్ట్ మూవీ సవ్యసాచి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున నేడు రిలీజ్ అయింది. ఓవర్సీస్ ప్రీమియర్ షోల తో మంచి టాక్ నే సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు రెగ్యులర్ షోల కి మొత్తం మీద ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుందో తెలుసుకుందాం పదండీ.

కథ: ట్విన్ వానిషింగ్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాద పడుతున్న హీరో కి ఎడమ చేయి తన కంట్రోల్ లో ఉండదు. దాంతో కొన్ని ఇబ్బందులను ఎదురుకుంటూ ఉంటాడు. అక్క భూమికతో ఉంటూ చదుకుంటూ ఉన్న హీరో కి కాలేజ్ లో నిధి పరిచయం అవ్వడం అది ప్రేమ గా మారడం జరుగుతుంది. అనుకోకుండా తన హీరో మేన కోడలు కిడ్నాప్ అవ్వడంతో…

కథ పూర్తిగా టర్న్ తీసుకుంటుంది. అసలు కిడ్నాప్ ఎందుకు అయింది, ఎవరు చేశారు, దేని కోసం చేశారు, హీరో తన మేన కోడలుని ఎలా కాపాడుకున్నాడు, ఆ క్రమంలో తన ఎడమ చేతి పవర్ ఏంటో ఎలా తెలుసుకున్నాడు అన్నది మిగిలిన కథ.

నటీనటులు: నాగ చైతన్య తన రోల్ వరకు సినిమాలో కుమ్మెశాడు, యాక్షన్ సీన్స్, సాంగ్స్ లో డాన్స్, ఎమోషనల్ సీన్స్ లో నటన ఇలా అన్నింటా సినిమా సినిమా కి ఇంప్రూవ్ అవుతున్నాడు నాగ చైతన్య. ఈ సినిమా లో కూడా అన్నింటా తన టాలెంట్ ఏంటో చూపించి మెప్పించాడు.

ఇక హీరోయిన్ నిధి అగర్వాల్ లుక్స్ పరంగా సూపర్బ్ అనిపించినా యాక్టింగ్ పరంగా మాత్రం జస్ట్ పాస్ మార్కులు దక్కాయి. ఇద్దరి పెయిర్ బాగుంది అనిపించింది, ఇక సినిమాలో నాగ చైతన్య తర్వాత హైలెట్ అయింది మాధవన్. రోల్ రొటీన్ విలనిజం అయినా మాధవన్ మాత్రం కుమ్మెశాడు.

డబ్బింగ్ మాత్రం అక్కడక్కడా సెట్ కాలేదు.ఇక హీరో మరియు విలన్ ల మధ్య వచ్చే సీన్స్ చాలా వరకు ఆకట్టుకుంటాయి. మరో ప్రధాన పాత్రలో భూమిక ఆకట్టుకుంది, మిగిలిన వాళ్ళలో వెన్నెల కిషోర్ మరియు శకలక శంకర్ ల కామెడీ కొంచం వర్కౌట్ అయింది. మిగిలిన నటీనటులు ఒకే అనిపించుకున్నారు.

సంగీతం: కీరవాణి అందించిన సాంగ్స్ పర్వాలేదు అనిపించగా సవ్యసాచి టైటిల్ సాంగ్ మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ పరంగా మాత్రం కుమ్మెశాడు. అవే సినిమాకి వెన్నెముకగా నిలిచాయి. లగ్గాయిత్తు సాంగ్ వినడానికి యావరేజ్ గా అనిపించినా చూడటానికి మాత్రం బాగుంది.

విశ్లేషణ: డైరెక్షన్ పరంగా చందు మొండేటి కొత్త పాయింట్ ని ఎంచుకున్నా కథలో డైరెక్ట్ గా ఎంటర్ అవ్వకుండా చాలా చిన్న కథలని ఇంటర్ లింక్ చేస్తూ వెళ్ళడంతో మెయింట్ పాయింట్ కి వెళ్లడానికి పట్టిన సమయం కొంత బోర్ కొడుతుంది.

అలాగే సెకెండ్ ఆఫ్ లో మెయిన్ పాయింట్ చెప్పే సమయంలో కూడా అక్కడక్కడా డ్రాగ్ చేశాడు దర్శకుడు. అవి తప్పితే మిగిలినా సన్నివేశాలు మొత్తం ఆకట్టుకున్నాయి. ఇక అక్కినేని ఫ్యాన్స్ కోరుకునే అన్నీ అంశాలు సినిమాలో ఉండేలా చూసుకుని మెప్పించాడు చందు మొండేటి.

ఇక హైలెట్స్ విషయానికి వస్తే… హీరో క్యారెక్టరైజేషన్, హీరో విలన్ సీన్స్, ఎడమ చేయి ఫైట్, లగ్గాయిత్తు సాంగ్. అని చెప్పొచ్చు.
ఇక మైనస్ ల విషయానికి వస్తే… ఫస్టాఫ్ కొన్ని బోర్ సీన్స్, సెకెండ్ ఆఫ్ డ్రాగింగ్ సీన్స్, స్టోరీ అక్కడక్కడా ప్రిడిక్ట్ చేసేలా ఉండటం అని చెప్పాలి.

ఓవరాల్ గా సినిమా అంచనాలను అందుకున్నా మించలేదు అని చెప్పాలి. కానీ రీసెంట్ నాగ చైతన్య మూవీస్ అన్నింటి లోకి ది బెస్ట్ మూవీ ఇదే అని చెప్పాలి.
మా రేటింగ్ 3 స్టార్స్… మీరు సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here