Home న్యూస్ ఇది మామూలు మాస్ కాదు…డే 2 ఊరమాస్ కలెక్షన్స్!!

ఇది మామూలు మాస్ కాదు…డే 2 ఊరమాస్ కలెక్షన్స్!!

0

 

   రాఘవ లారెన్స్ హీరోగా డైరెక్టర్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కాంచన 3 బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోస్తూ దూసుకు పోతుంది, సినిమా మొదటి రోజే అంచనాలను మించి వసూళ్ళ పరంగా దుమ్ము లేపగా రెండో రోజు న కూడా ఏమాత్రం జోరు తగ్గకుండా అల్టిమేట్ వసూళ్ళ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది, సినిమా కి ఈవినింగ్ అండ్ నైట్ షోలలో IPL మ్యాచులు ఎఫెక్ట్ చూపినా కానీ స్ట్రాంగ్ గా నిలిచింది.

రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి అవలీలగా 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్నట్లు సమాచారం, ఇది నిజంగానే ఊచకోత అని చెప్పాలి. సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు పూర్తిగా తేలాల్సి ఉండటం తో ఈ లెక్క మరింత…

పెరిగే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఓవరాల్ గా సినిమా తక్కువ థియేటర్స్ లో మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను ఏలుతుంది, కొన్ని ఏరియాల్లో తెలుగు సినిమా జెర్సీ కి నెక్ టు నెక్ కలెక్షన్స్ ని రెండో రోజు అందుకుంది కాంచన 3 సినిమా.

కాంచన సిరీస్ కి తెలుగు లో ఉన్న క్రేజ్ కి ఇది నిదర్శనం అనే చెప్పాలి. ముఖ్యంగా హర్రర్ కామెడీ లు రొటీన్ అయినా కానీ కాంచన సిరీస్ మాత్రం మొదటి నుండి తెలుగు అండ్ తమిళ్ లో సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంటూనే ఉంది, ఇక సినిమా రెండో రోజు తమిళ్ లో కూడా..

మరో సారి 10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని వసూల్ చేసినట్లు చెబుతున్నారు. అక్కడ స్టార్ హీరోలు తప్పితే 10 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకున్న మొదటి హిరో లారెన్స్ అనే చెప్పాలి. ఇక రెండో రోజు అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here