అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ శైలజా రెడ్డి అల్లుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 4 రోజుల ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో టోటల్ గా 17.25 కోట్ల షేర్ ని 28 కోట్ల గ్రాస్ ని వసూల్ చేయగా సినిమా బ్రేక్ ఈవెన్ కి మరో 7.75 కోట్ల టార్గెట్ తో 5 వ రోజు వర్కింగ్ డే టెస్ట్ ను ఎదుర్కొంది.
కాగా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజు న కొన్ని ఏరియాల్లో ఫుల్స్, కొన్ని ఏరియాల్లో యావరేజ్ గా నిలిచింది ఈ సినిమా. ఓవరాల్ గా ఆదివారం 60% ఆక్యుపెన్సీ ఉంటే….సోమవారం టోటల్ గా నైట్ షోల ని కలుపుకుంటే 25% వరకు ఆక్యుపెన్సీని సాధించింది.
ఈ లెక్కన సినిమా 5 వ రోజునే టోటల్ గా 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే ఛాన్స్ ఉంది. అదే నిజం అయితే సినిమా మరో 6.5 కోట్ల రేంజ్ లో షేర్ ని మిగిలిన రన్ లో అందుకోవాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి.