Home న్యూస్ 5 డిసాస్టర్లు…అయినా నిర్మాతకి సాలిడ్ ప్రాఫిట్స్ తెప్పించిన శర్వానంద్!!

5 డిసాస్టర్లు…అయినా నిర్మాతకి సాలిడ్ ప్రాఫిట్స్ తెప్పించిన శర్వానంద్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్ కి రీసెంట్ టైం లో అసలు ఏమాత్రం కలిసి రావడం లేదు అన్నది ఎవ్వరూ కాదనలేని నిజం, బాక్స్ ఆఫీస్ దగ్గర చేసిన సినిమా చేసినట్లు నిరాశ పరుస్తూ ఉండగా బాక్ టు బాక్ 5 డిసాస్టర్ మూవీస్ ని తన ఖాతాలో వేసుకున్న శర్వానంద్ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా తో వచ్చాడు. ఈ సినిమా కూడా అంతంత మాత్రమే ఉండగా…

Aadavallu Meeku Johaarlu 3 Days Collections!!

కలెక్షన్స్ కోసం కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమా కన్నా ముందు బాక్ టు బాక్ భారీ డిసాస్టర్లు పడుతున్నా కానీ శర్వానంద్ మూవీస్ కి శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ డబ్బింగ్ రైట్స్ రేట్లు బాగానే సొంతం అవుతూ ఉండటంతో నిర్మాతలు…

   

Aadavallu Meeku Johaarlu 2 Days Collections!!

శర్వానంద్ ఫ్లాఫ్ మూవీస్ పడుతున్నా కానీ మంచి బడ్జెట్ తో సినిమాలు చేస్తూ వస్తున్నారు… ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమానే తీసుకున్నా ఈ సినిమా కి కూడా నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టాడు శర్వానంద్…. బాక్ టు బాక్ 5 డిసాస్టర్ లు పడ్డా కానీ…

ఈ సినిమా కోసం నిర్మాతలు ఆల్ మోస్ట్ 24 కోట్ల రేంజ్ లో బడ్జెట్ పెట్టారని టాలీవుడ్ సమాచారం. ఆ మొత్తాన్ని నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే వెనక్కి తీసుకు వచ్చాడు శర్వానంద్, రష్మిక స్టార్ డం కూడా ఈ సారి హెల్ప్ అవ్వడంతో నాన్ థియేట్రికల్ రైట్స్ 25 కోట్ల రేటు సొంతం అవ్వగా థియేట్రికల్ బిజినెస్ 15.5 కోట్ల దాకా పలికింది… దాంతో థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి….

మొత్తం మీద 40.5 కోట్ల బిజినెస్ జరగగా బడ్జెట్ అండ్ పబ్లిసిటీ ఖర్చులు పోనూ 10 కోట్లకు పైగానే లాభం నిర్మాతలకు సొంతం అయ్యిందని ట్రేడ్ వర్గాల అంచనా. అందుకే ఫ్లాఫ్స్ పడుతున్నా శర్వానంద్ తో సినిమాలు భారీగానే తీస్తున్నారు నిర్మాతలు అంటున్నారు. సినిమాలు అయితే వస్తున్నాయి కానీ ఏ సినిమా తో కంబ్యాక్ ఇస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here