Home న్యూస్ ఏంటి రాజ శేఖర్ మీద ఇంత డబ్బు పెట్టారా…ఏమవుతుందో!!

ఏంటి రాజ శేఖర్ మీద ఇంత డబ్బు పెట్టారా…ఏమవుతుందో!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సీనియర్ హీరో రాజశేఖర్ హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది, 2008 టైం లో గోరింటాకు సినిమా తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన రాజ శేఖర్ తర్వత చేసిన సినిమాలు ఏవి కూడా ఆడియన్స్ ను అలరించడంలో విఫలం అయ్యాయి. ఒకటి తర్వాత ఒకటి రాజశేఖర్ మూవీస్ రిలీజ్ అవ్వడం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడం జరిగింది.. ఇలాంటి టైం లో రాజశేఖర్ 2017 టైం లో…

గరుడ వేగ సినిమాతో తిరిగి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు కానీ ఆ సినిమా బడ్జెట్ ఎక్కువ అవ్వడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ ని అందుకోలేదు. తర్వాత కల్కి సినిమా కూడా బడ్జెట్ ఎక్కువ అవ్వడంతో పర్వాలేదు అనిపించినా సక్సెస్ అవ్వలేదు. కానీ తర్వాత….

వరుస సినిమాలు చేస్తాడు అనుకున్న రాజశేఖర్ నుండి కొత్త సినిమాలు ఏవి పెద్దగా రాలేదు. ఈ లోపు వేవ్ లు కూడా రాగా కొంత గ్యాప్ తర్వాత రాజ శేఖర్ నుండి వచ్చిన కొత్త సినిమా శేఖర్ ఆడియన్స్ ముందుకు ఈ శుక్రవారం రిలీజ్ అవ్వగా సినిమా కి తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా…

కొన్ని చోట్ల ఓన్ రిలీజ్ కొన్ని చోట్ల అడ్వాన్స్ బేస్ మీద రిలీజ్ జరిగింది. మొత్తం మీద సినిమా బిజినెస్ వాల్యూ నైజాంలో 1 కోటి దాకా సీడెడ్ లో 30 లక్షల దాకా ఆంధ్రలో 1.20 కోట్ల దాకా ఉంటుందని అంచనా…. దాంతో తెలుగు రాష్ట్రాలలో సినిమా 2.50 కోట్ల రేంజ్ వర్త్ బిజినెస్ ను సాధించగా వరల్డ్ వైడ్ గా 2.65 కోట్ల రేంజ్ వర్త్ బిజినెస్ ను అందుకుందని ట్రేడ్ వర్గాల అంచనా…

దాంతో సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర 3 కోట్ల రేంజ్ లో అయినా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత డబ్బు ప్రస్తుతం ఎలాంటి బజ్ లేని శేఖర్ సినిమా పెట్టడం పెద్ద రిస్క్ అనే చెప్పాలి. ఇక సినిమా తెలుగు రాష్ట్రాలలో 305 థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here