Home న్యూస్ శివం భజే ట్రైలర్ రివ్యూ…లాస్ట్ షాట్ శివతాండవం సామి!!

శివం భజే ట్రైలర్ రివ్యూ…లాస్ట్ షాట్ శివతాండవం సామి!!

0

రాజుగారిగది2 సినిమాలో కీలక పాత్ర పోషించి మంచి పేరుని సొంతం చేసుకున్న యంగ్ హీరో అశ్విన్ బాబు లాస్ట్ హిడింబ అనే డిఫరెంట్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చినా ఆశించిన మేర రెస్పాన్స్ ఆడియన్స్ నుండి రాలేదు..ఇక ఇప్పుడు ఆ సినిమా తర్వాత అశ్విన్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ అయిన శివం భజే(Shivam Bhaje Telugu Movie) ఇప్పుడు…

ఆడియన్స్ ముందుకు ఆగస్టు 1న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు…ట్రైలర్ అంతా కథ కన్ఫ్యూజింగ్ గానే అనిపించినా ఎంగేజింగ్ గానే ట్రైలర్ ను కట్ చేయగా ట్రైలర్ ఎండ్ లో మాత్రం ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయని విధంగా…

మహా శివుడి శివ తాండవం చూపించి ఒక్కసారిగా సినిమా మీద అంచనాలను పెంచేశారు…ట్రైలర్ కథ పాయింట్ వరల్డ్ మాప్ లో ఇండియాను కనుమరుగు అయ్యేలా చేయాలనీ చూస్తున్న విలన్స్ వివిధ ప్రయత్నాలతో అందరినీ చంపుతూ ఉంటారు…

ఈ క్రమంలో ఇబ్బందుల్లో పడ్డ హీరో ఎలా వీటిని ఎదిరించడానికి సిద్ధం అయ్యాడు ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. కాన్సెప్ట్ ఓకే అనిపించేలానే ఉన్నా కూడా మహా శివున్ని కథలో ఎలా కలిపారు…ఆ సీన్ ఎలా ఉండబోతుంది అన్న ఆసక్తి…

ట్రైలర్ ఎండ్ లో శివున్ని చూపించడంతో ఎక్స్ పెర్టేషన్స్ పెరిగిపోగా ఆ క్లైమాక్స్ పోర్షన్ సస్పెన్స్ అంటూ టీం చెబుతున్నారు. రీసెంట్ టైంలో దేవుణ్ణి పురాణాలను టచ్ చేస్తూ వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా సందడి చేశాయి…

ఇప్పుడు చిన్న సినిమానే అయినా కూడా శివుడిని బేస్ చేసుకుని తెరకెక్కుతున్న శివం భజే మూవీ మేకర్స్ సరిగ్గా డీల్ చేసి దేవుణ్ణి బాగా చూపిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ గ్యారెంటీ రిజల్ట్ ను సొంతం చేసుకునే అవకాశం అయితే ఎంతైనా ఉంటుంది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here