Home న్యూస్ లాస్ట్ మినట్ లో దెబ్బ మీద దెబ్బ…ఏంటి సామి ఇది!

లాస్ట్ మినట్ లో దెబ్బ మీద దెబ్బ…ఏంటి సామి ఇది!

0

నాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగ రాయ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మరికొన్ని గంటల్లో భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా కి ఆంధ్రలో వరుస పెట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి అని చెప్పాలి. ఈ ఇంపాక్ట్ లేటెస్ట్ మూవీ పుష్ప పై మరింత ఎఫెక్ట్ చూపుతుండగా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న శ్యామ్ సింగ రాయ్ పై మరింత ప్రెజర్ పెట్టబోతుంది అని చెప్పాలి.

ఆల్ రెడీ నాని నటించిన లాస్ట్ 2 సినిమాలు థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ అవ్వాల్సి రాగా ఈ సినిమాను మట్టుకు ఎట్టి పరిస్థితులలో కూడా థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యి సినిమాను డిసెంబర్ 24 న రిలీజ్ చేయబోతుండగా సినిమా కి…

ఇప్పుడు ఆంధ్రలో లో టికెట్ రేట్లు భారీ దెబ్బ కొట్ట బోతుండగా చాలా ఏరియాల్లో ప్రభుత్వం కొన్ని థియేటర్స్ ని లైసెన్స్ లేని కారణంగా మూసి వేయగా మరి కొన్ని చోట్ల క్వాలిటీ లేవని మూసేశారు. ఇక చాలా సి సెంటర్స్ లో లో టికెట్ రేట్ల కారణంగా ఆ థియేటర్స్ ని…

ఇప్పుడు టెంపరరీగా మూసేస్తున్నామని ప్రకటించారు. ఆల్ మోస్ట్ మూసేసిన థియేటర్స్ కౌంట్ 100 కి చేరుకునేలా ఉందని చెబుతూ ఉండటం విచారకరం. ఇవన్నీ ఇప్పుడు ఆల్ రెడీ రిలీజ్ అయిన పుష్ప కి 6వ రోజు తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉండగా ఇప్పుడు శ్యామ్ సింగ రాయ్ సినిమా కి ఓపెనింగ్స్ పరంగా ఇప్పుడు గట్టి ఎదురు దెబ్బ కొట్టేలా ఉందని…

ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆల్ రెడీ హిట్ కోసం కష్టపడుతున్న నానికి ఆంధ్రలో ఇప్పుడు ఈ ఎఫెక్ట్ వలన ఓపెనింగ్స్ దెబ్బ పడటం, వీకెండ్ కలెక్షన్స్ పై ఎఫెక్ట్ ఉండటం ఖాయమని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఆంధ్రలో పరిస్థితులు సినిమాల కలెక్షన్స్ పై భారీ దెబ్బ కొడుతున్నాయి. మరి శ్యామ్ సింగ రాయ్ కి ఓపెనింగ్స్ పై ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here