టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ దగ్గర రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి సూపర్ ఫాం తో దూసుకు పోతున్న విషయం తెలిసిందే, ముందు ఖైదీ నంబర్ 150 తర్వాత సైరా నరసింహా రెడ్డి సినిమాలతో సెన్సేషనల్ కలెక్షన్స్ ని నమోదు చేశాడు, ఇక ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీస్ లిస్టు కూడా సాలిడ్ గా ఉందని చెప్పాలి. డైరెక్టర్స్ మరీ పవర్ ఫుల్ గా లేకున్నా మెగాస్టార్ క్రేజ్ తో…
ఈ సినిమాల క్రేజ్ రిలీజ్ సమయానికి భారీ క్రేజ్ ని సొంతం చేసుకోవడం ఖాయం. ప్రస్తుతం చేస్తున్న ఆచార్య తప్పితే మిగిలిన డైరెక్టర్స్ అందరూ కొత్త అండ్ మీడియం రేంజ్ డైరెక్టర్సే… ప్రస్తుతం కొరటాల తో ఆచార్య చేస్తున్న మెగాస్టార్ తర్వాత సాహో డైరెక్టర్….
సుజీత్ డైరెక్షన్ లో మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ సినిమా తెలుగు రీమేక్ చేస్తున్నాడు, ఈ సినిమా తర్వాత బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా త్వర్వత మెహర్ రమేష్ తో మరో సినిమా చేయబోతున్నాడు మెగాస్టార్. ఇక ఈ రెండు సినిమాలు ఎలా వస్తాయి అన్నది ఆసక్తి కరంగా మారంగా…
ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేయబోయే సినిమా గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ అని అంటున్నారు, రీసెంట్ గా మెగాస్టార్ కోసం రాసుకున్న కథని వినిపించారట. దానికి మెగాస్టార్ కూడా ఓకే చెప్పారని టాక్ ఉంది, మెగాస్టార్ కెరీర్ ఇది వరకు చేసిన రౌడీ అల్లుడు రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని టాక్ ఉంది.
ఇది ఎంతవరకు నిజం అనేది ప్రస్తుతానికి అయితే సస్పెన్స్ కానీ నిజం అయితే మట్టుకు చిరు కొరటాల తో చేసే ఆచార్య తర్వాత చేసే సినిమాలలో ఇదే క్రేజీ మూవీ అయ్యే అవకాశం ఉంది, మినిమం గ్యారెంటీ మూవీ ఇచ్చే హరీష్ శంకర్ కచ్చితంగా మెగాస్టార్ ను ఊరమాస్ గా చూపెట్టి ఎంటర్ టైన్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పలి. మరి సినిమా కన్ఫాం అవుతుందో లేదో చూడాలి…