కొన్ని కొన్ని సార్లు పెద్ద సినిమాల కన్నా కూడా చిన్న సినిమాలకే ఎక్కువ క్రేజ్ ఉంటూ వస్తుంది, బాక్స్ ఆఫీస్ దగ్గర కొన్ని సార్లు చిన్న సినిమాలు పెద్ద సినిమాల మాదిరి క్రేజ్ ను సొంతం చేసుకుని రిలీజ్ అవ్వడం ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోవడం లాంగ్ రన్ ని కూడా దక్కించు కోవడం లాంటివి మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఇయర్ ఇప్పటికే ఉప్పెన లాంటి కొత్త హీరో నటించిన సినిమా…
జాతిరత్నాలు లాంటి చిన్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భీభత్సం సృష్టించగా అలాంటి రేంజ్ ని అందుకోవడానికి అవకాశం ఉన్న సినిమాగా SR కళ్యాణ మండపం సినిమా ను అనుకోవచ్చు. పాటలు అద్బుతమైన సక్సెస్ గా నిలిచిన ఈ సినిమా తర్వాత రిలీజ్ అయిన టీసర్ మరియు…
ట్రైలర్ లకు కూడా అద్బుతమైన రెస్పాన్స్ రావడమే కాదు టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల సినిమాలకు వచ్చే రేంజ్ లైక్స్ దక్కాయి. అలాంటి క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కి టైం ఉండగానే టోటల్ థియేట్రికల్ బిజినెస్ 3.2 కోట్ల రేటు ని సొంతం చేసుకుందని చెప్పొచ్చు.
ఓ చిన్న సినిమా కి రిలీజ్ కి ఇంకా టైం ఉండగానే ఈ రేంజ్ బిజినెస్ అద్బుతం అనే చెప్పాలి. కానీ సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాలేక పోయింది కానీ డిజిటల్ రిలీజ్ కి రీసెంట్ గా ఏకంగా 6 కోట్ల రేంజ్ లో ఆఫర్స్ వచ్చాయని టాక్ వచ్చింది, ఇక రీసెంట్ గా రేటు మరింత పెంచి…
6.5 కోట్ల ఫైనల్ డీల్ రేటు ని మేకర్స్ కి ఆఫర్ చేశారట OTT వాళ్ళు, కానీ మేకర్స్ ఈ రేటు కి కూడా టెంప్ట్ అవ్వకుండా సినిమాను కేవలం థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని రీసెంట్ గా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇంత రేటు కి కూడా నో చెప్పారు అంటే సినిమా పై నమ్మకం గట్టిగానే ఉందని చెప్పాలి. ఇక సినిమా సెకెండ్ వేవ్ తర్వాత ఏ రేంజ్ సంచలనం సృష్టిస్తుందో చూడాలి.