శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ శ్రీకారం బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా భారీ పోటి లో రిలీజ్ అవ్వగా సినిమా కి మంచి పాజిటివ్ టాక్ ఆడియన్స్ నుండి లభించింది, వ్యవసాయం మీద మంచి మెసేజ్ ఇచ్చేలా ఉన్న ఈ సినిమా అందరి నుండి మంచి ప్రశంసలు లభించగా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఓపెనింగ్స్ స్లో గా స్టార్ట్ అయిన ఈవినింగ్ షోల నుండి పుంజుకున్న సినిమా రోజును ఘనంగా ముగించగా…
రెండో రోజు నుండి రెట్టించిన జోరు చూపుతుంది అనుకున్నా స్లో డౌన్ అవుతూ షాక్ ఇచ్చింది, సినిమా ఇక మూడో రోజు మరింత భారీ డ్రాప్స్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని అందుకోవడానికి చాన్సులను మరింతగా తక్కువ చేసుకుంటుంది.
దీనికి జాతితర్నాలు అల్టిమేట్ రేంజ్ లో పెర్ఫార్మ్ చేయడం ఒక రీజన్ అయితే… భారీ గా పెంచిన టికెట్ హైక్స్ మరో రీజన్. ఆఫ్ లైన్ లో టికెట్ సేల్స్ టికెట్ హైక్స్ వలన అసలు అమ్ముడు పోవడం లేదు. దాంతో అది కలెక్షన్స్ పై ఇంపాక్ట్ ఎక్కువగా చూపుతూ 3 వ రోజు కేవలం 1.18 కోట్లకే సరిపెట్టుకుంది.
ఇక మొత్తం మీద సినిమా 3 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే..
👉Nizam: 2.07Cr
👉Ceeded: 1.19Cr
👉UA: 94L
👉East: 55L
👉West: 41L
👉Guntur: 83L
👉Krishna: 36L
👉Nellore: 26L
AP-TG Total:- 6.61CR (11.22Cr Gross~)
Ka+ROI – 20L( updated )
OS – 28L
Total World Wide: 7.09CR( 12.10CR~ Gross)
సినిమాను టోటల్ గా 17 కోట్లకు అమ్మగా 17.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 10.41 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది, అంటే 4 వ రోజు ఆదివారమ సినిమా మొదటి రోజు లెవల్ లో కలెక్షన్స్ ని సాధిస్తేనే ఆ అవకాశం ఉంటుంది అని చెప్పొచ్చు.
Utter flop