శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ శ్రీకారం బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ పోటి లో రిలీజ్ అయింది, సినిమా ట్రైలర్ సినిమా కాన్సెప్ట్ ఏంటో క్లియర్ గా చెప్పగా సాంగ్స్ మంచి హిట్ అవ్వడంతో సినిమా పై మంచి బజ్ ఉంది కానీ శర్వానంద్ ప్రీవియస్ మూవీస్ రిజల్ట్ వలన ఈ సినిమా పై ప్రెజర్ ఎక్కువగా ఉంది, మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ…
కథ పాయింట్ కి వస్తే… సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన హీరో సంక్రాంతి టైం లో ఊరికి వచ్చి తన తండ్రితో కలిసి ఉంటాడు, తర్వాత తిరిగి సిటీకి వచ్చి తన జాబ్ లో బిజీగా ఉండగా ప్రమోషన్ తో యుస్ కి వెళ్ళే ఛాన్స్ వస్తే నో చెప్పి జాబ్ రిసైన్ చేసి ఊరికి వచ్చి వ్యవసాయం చేయడం మొదలు పెడతాడు…
దాని వెనుక ఉన్న కారణాలు ఏంటి, హీరో అనుకున్నది ఎలా సాధించాడు అన్నది మొత్తం మీద సినిమా కథ…కథగా చూస్తె ఈ సినిమాకి మహేష్ మహర్షి మూవీ కి పోలికలు పుష్కలంగా ఉన్నప్పటికీ ఇక్కడ ట్రీట్ మెంట్ డిఫెరెంట్ గా ఉంటుంది, ఫస్టాఫ్ మొదలు అవ్వడమే మంచి ఫీల్ తో మొదలు అయ్యి…
అలా సిటీ కి వచ్చాక హీరోయిన్ తో లవ్ స్టొరీ కొంచం బోర్ కొట్టినా తర్వాత అసలు కథలోకి ఎంటర్ అయ్యి మంచి పాయింట్ తో ఇంటర్వెల్ తర్వాత ఫ్లో ఎక్కడా మిస్ కాకుండా ఉండే సెకెండ్ ఆఫ్ అండ్ ఎమోషనల్ లాస్ట్ 30 నిమిషాలతో సినిమా బాగా మెప్పించింది అని చెప్పాలి. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే…
శర్వానంద్ ఎప్పటి లానే తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించాడు, తన డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఇక హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ క్యూట్ లుక్స్ తో మెప్పించగా ఇద్దరి పెయిర్ కూడా బాగుంది, రావ్ రమేష్ రోల్ కూడా బాగుంది…ఇక సాయి కుమార్ విలనిజం రొటీన్ గానే ఉండగా మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా ఉన్నంతలో బాగానే పెర్ఫార్మ్ చేశారు. ఇక సంగీతం బ్యాగ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే….
మిక్కీ జే మేయర్ తన మార్క్ సాంగ్స్ తో ఎలా మెప్పించాడో బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా ఫుల్ మార్కులు కొట్టేశాడు, ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే మాత్రం రొటీన్ గా ఉంది, స్టొరీ పాయింట్ యిట్టె చెప్పే విధంగా ఉండగా స్క్రీన్ ప్లే కూడా సీన్ బై సీన్ అనుకున్నదే వస్తూ ఉంటుంది కానీ ఆడియన్స్ ఆ సీన్స్ కి కనెక్ట్ అవుతారు. డైలాగ్స్ అద్బుతంగా ఉన్నాయి, వ్యవసాయం మీద రాసిన డైలాగ్స్ అన్నీ బాగా వచ్చాయి.
ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండగా సినిమాటోగ్రఫీ అదిరిపోయింది, ఇక డైరెక్షన్ విషయానికి వస్తే కిషోర్ బి మహర్షి మూవీ ని మరో విధంగా తీసినట్లు ఈ సినిమాను తెరకెక్కించారు, చివరి 30 నిమిషాలు ఈ సినిమాకి కూడా ఆయువు పట్టు, ఎమోషనల్ సీన్స్, వ్యవసాయం మీద ఇచ్చిన మెసేజ్ కొత్తగా ఉండటం ఈ సినిమా స్పెషాలిటీ… ఇక లెంత్ కొంచం ఎక్కువ అయినట్లు అనిపించడం…
కథనం స్లోగా సాగడం సినిమాకి డ్రా బ్యాక్స్, కానీ ఎలాంటి అంచనాలు లేనివాళ్ళు సినిమాకి వెళితే కచ్చితంగా సినిమా మెప్పించడం ఖాయమని చెప్పాలి, అలాగే శర్వానంద్ కి రీసెంట్ మూవీస్ అన్నింటిలోకి ఇది బెస్ట్ అండ్ కెరీర్ లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా చెప్పుకోవాలి.
రొటీన్ మూవీస్ ఇష్టపడే వారికి కొంచం నచ్చే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ ఎంటర్ టైన్ మెంట్ పెద్దగా లేకపోయినా కొత్తదనం కోరుకునే వారికి సినిమా కచ్చితంగా నచ్చుతుంది, సినిమాకి మొత్తం మీద మా రేటింగ్ 3 స్టార్స్. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ప్రదర్శన ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తి కరం అని చెప్పొచ్చు.