Home న్యూస్ స్త్రీ2 రివ్యూ….రికార్డుల జాతర ఖాయం!!

స్త్రీ2 రివ్యూ….రికార్డుల జాతర ఖాయం!!

0

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ రిలీజ్ అయిన మూవీస్ అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేదు…ఇలాంటి టైంలో ఆగస్టు 15 వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు ఇప్పుడు శ్రద్దా కపూర్(Shraddha Kapoor) మెయిన్ లీడ్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్త్రీ2(Stree2 Movie Review in Telugu) భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చింది..మొదటి పార్ట్ భారీ హిట్ తర్వాత ఏర్పడిన స్త్రీ యూనివర్స్ లో కీలకంగా మారిన స్త్రీ2 ఎలా ఉంది ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…

కథ పాయింట్ కి వస్తే ఊరిని వీడిపోయిన స్త్రీ ఆత్మ గురించి మరచిపోతున్న టైంలో ఊరిని మరో ఆత్మ పట్టి పీడిస్తుంది…ఈ సారి స్త్రీని చంపేసిన సర్ కటే అనే ఆత్మ ఊరిని పట్టి పీడిస్తున్న వేల స్త్రీ తిరిగి వచ్చాక ఏం జరిగింది అన్నది సినిమా కథ పాయింట్…బ్లాక్ బస్టర్ మూవీ కి వచ్చిన సీక్వెల్ కథ పరంగా నార్మల్ గానే ఉన్నా కూడా ఫస్టాఫ్ వరకు…

హర్రర్ సీన్స్ ఉన్నా కూడా కామెడీ చాలా చోట్ల వర్కౌట్ అవ్వడం, ఇంటర్వెల్ ఎపిసోడ్ అదిరిపోవడంతో ఫస్టాఫ్ కే సూపర్ హిట్ రేంజ్ లో అనిపించిన సినిమా సెకెండ్ ఆఫ్ మరీ ఫస్టాఫ్ రేంజ్ లో లేకపోయినా కూడా ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా ఉండటంతో ఓవరాల్ గా సినిమా ఎండ్ అయ్యే టైంకి ఆడియన్స్ పెట్టుకున్న అంచనాలను చాలా వరకు అందుకున్న స్త్రీ2 మూవీ…

అందుకుని బాగా మెప్పించింది… శ్రద్దా కపూర్ తన రోల్ కి ఫుల్ న్యాయం చేయగా తన సీన్స్ బాగా వచ్చాయి. ఇక హీరో రాజ్ కుమార్ రావ్ అండ్ గ్యాంగ్ కామెడీ సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. కొన్ని చోట్ల అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ఓవరాల్ గా సినిమా ఎండ్ అయ్యే టైంకి మంచి మూవీ చూసిన ఫీలింగ్ కలగడం ఖయామని చెప్పాలి. అలాగే స్త్రీ3 గురించి చెప్పిన విధానం కూడా మెప్పించింది…

ఓవరాల్ గా సీక్వెల్ మీద ఉన్న హైప్ ను చాలా వరకు మ్యాచ్ చేసి రచ్చ చేసిన స్త్రీ2 మూవీ ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో ఊహకందని వసూళ్ళతో మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉండగా బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో ఇక ఎపిక్ రికార్డులు స్త్రీ2 నమోదు చేయడం ఖాయం. ఈ వీకెండ్ ఓవరాల్ గా అన్ని మూవీస్ లో హైప్ కి తగ్గట్లు చాలా వరకు మెప్పించిన సినిమాగా స్త్రీ2 నిలుస్తుంది అని చెప్పాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here