Home గాసిప్స్ మెగా అల్లుడి సినిమాకి సాలిడ్ OTT రేటు….ఎంత పలికిందంటే!

మెగా అల్లుడి సినిమాకి సాలిడ్ OTT రేటు….ఎంత పలికిందంటే!

0

ఫస్ట్ వేవ్ తర్వాత డిజిటల్ రిలీజ్ లు తెలుగు లో ఆగిపోయాయి. ఇప్పుడు సెకెండ్ వేవ్ మొదలైంది… మళ్ళీ OTT ఆఫర్స్ కూడా మొదలు అయ్యాయి…. మెగా ఫ్యామిలీ నుండి హీరో గా లాంచ్ అయిన అలాగే అవుతున్న హీరోలు చాలానే ఉన్నారు, రెండేళ్ళ క్రితం విజేత సినిమా తో టాలీవుడ్ లో హీరోగా లాంచ్ అయిన కళ్యాణ్ దేవ్ ఆ సినిమా తో ఏమాత్రం ఇంపాక్ట్ చూపలేక పోయాడు, బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న ఆ సినిమా తర్వాత తన నుండి కొత్త సినిమా ఇప్పటి వరకు ఆడియన్స్ ముందుకు రాలేదు.

అప్పటి నుండి కళ్యాణ్ దేవ్ నటిస్తున్న సినిమా సూపర్ మచ్చి ముందు హీరోయిన్ చేంజ్ వలన కొంచం లేట్ అవ్వగా తర్వాత అనుకోని కారణాల వలన డిలే అవుతూ రాగా ఈ ఇయర్ లో కరోనా వలన పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది, కాగా సినిమా షూటింగ్ మొత్తం మీద కంప్లీట్ అయిందని సమాచారం.

కళ్యాణ్ దేవ్ రచితా రామ్ ల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పోస్టర్ లు అప్పుడప్పుడు రిలీజ్ అవుతూ ఉండగా రీసెంట్ గా సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది అన్న టాక్ తెలిసి సినిమా కోసం OTT యాప్స్ తమ ట్రైల్స్ ను మొదలు పెట్టినట్లు సమాచారం. లాస్ట్ ఇయర్ కొన్ని ఆఫర్స్ వచ్చాయి కానీ వేవ్ ఆగిపోవడం తో మంచి టైం చూసుకుని థియేటర్స్ లో రిలీజ్ అనుకున్నా….

ఇప్పుడు సెకెండ్ వేవ్ వలన మళ్ళీ OTT కి వెళుతున్నారని వార్తలు శిఖారు చేస్తున్నాయి… సినిమా కోసం 6 నుండి 7 కోట్ల రేంజ్ లో డైరెక్ట్ రిలీజ్ కోసం ఆఫర్లు కోట్ చేస్తున్నారట, మొదటి సినిమా ఫ్లాఫ్ అయినా కానీ రెండో సినిమా కి ఇలాంటి ఆఫర్స్ రావడం గొప్ప విషయమే అనే చెప్పాలి.. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం సినిమాలు రిలీజ్ అయ్యి వర్కౌట్ అవ్వడానికి మళ్ళీ కొంచం టైం పట్టేలా కనిపిస్తుంది… ఒక వేల రిలీజ్ అయినా….

 కానీ ఇలాంటి బిజినెస్ ను అందుకోవడం కష్టమే అని చెప్పాలి. కానీ మొదటి సినిమా వర్కౌట్ అవ్వక పోవడం తో ఈ సినిమా పైనే ఆశలు పెట్టుకోవడంతో OTT ఆఫర్స్ ని యూనిట్ పట్టించుకోవడం లేదని తెలుస్తుంది, మరి సినిమా ఫైనల్ డిసిషన్ ఏమవుతుంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here