టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సెన్సేషనల్ 151 వ సినిమా సైరా నరసింహా రెడ్డి పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అందరికీ తెలిసిందే, దసరా కానుకగా ముందే అక్టోబర్ 2 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అన్ని భాషల్లో అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. కాగా సినిమా దాదాపు రెండున్నర ఏళ్లుగా తెరకెక్కుతుండగా అసలు సినిమా బడ్జెట్ ఎంత అనే వివరాలు ఎవరికీ తెలియ రాలేదు.
కానీ ట్రేడ్ లో సినిమా బడ్జెట్ సుమారు గా 200 కోట్ల లోపు ఉండొచ్చు అన్న టాక్ ఎప్పటి నుండో ఉంది, కాగా రీసెంట్ గా సినిమా దర్శకుడు అయిన సురేందర్ రెడ్డి అఫీషియల్ గా సినిమా బడ్జెట్ ఎంత అనేది తెలియజేశారు. సినిమా ను ముందు 100 కోట్ల నుండి 120 కోట్ల రేంజ్….
బడ్జెట్ లో అనుకున్నా అది పెరిగి పెరిగి సుమారు 250 కోట్ల నుండి 270 కోట్ల దాకా అయ్యింది అన్నట్లు తెలియజేశారట. అంటే ఎంత ప్రతిష్టాత్మకంగా సినిమాను రూపొందించారో అర్ధం చేసుకోవచ్చు. ఇంత బడ్జెట్ పెరిగినా కానీ నిర్మాత అయిన రామ్ చరణ్ ఒక్కసారి కూడా ఓవర్ బడ్జెట్ అవుతుందని ఆలోచించలేదని…
పైపెచ్చు ఇది నాన్నగారికి మనం ఇచ్చే ఓ అపురూపమైన చిత్రంగా నిలిచిపోవాలని కోరుకున్నారని చెప్పాడట. ఇంత బడ్జెట్ రికవరీ అవ్వాలి అంటే సినిమా బిజినెస్ కూడా దుమ్ము లేచిపోయే రేంజ్ లో జరగాలి, ట్రేడ్ లో టాక్ ప్రకారం బిజినెస్ 190 కోట్లకు పైగా జరుగుతుందట.
ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ తో మొత్తం మీద 300 కోట్లకు పైగా రికవరీ అవ్వడం ఖాయమని ట్రేడ్ లో టాక్ వినిపిస్తుంది. ఇక రిలీజ్ అయిన తర్వాత సినిమా అంచనాలను అందుకుంటే కచ్చితంగా సంచలన కలెక్షన్స్ తో ఇండస్ట్రీ రికార్డులను బాహుబలి రికార్డ్ లను కూడా సవాల్ చేసే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.