టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగును ఆల్ మోస్ట్ ముగించింది, టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలను త్వరలోనే అప్ డేట్ చేస్తామ్. ముందుగా తెలుగు రాష్ట్రాలలో కాకుండా మిగిలిన చోట్ల సినిమా కలెక్షన్స్ పరిస్థితి ని గమనిస్తే సినిమా తమిళ్ మరియు కేరళలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ ద్వారా రిలీజ్ అవ్వగా సినిమా తీవ్ర పోటి ని ఎదురుకుంది.
ముఖ్యంగా తమిళ్ లో శివ కార్తికేయన్ అలాగే ధనుష్ సినిమాలు రెండూ వరుసగా రిలీజ్ అవ్వడం రెండూ సూపర్ హిట్లు గా నిలవడం సైరా కి తమిళనాడు అలాగే కేరళలో భారీ గా ఎదురుదెబ్బ కొట్టింది, మరో పక్క బాలీవుడ్ మూవీ వార్ హాలీవుడ్ మూవీ జోకర్ కూడా ఇక్కడ డామినేట్ చేశాయి.
ఇలా అన్ని సినిమాల మధ్య 270 కోట్ల భారీ బడ్జెట్ పెట్రియాటిక్ మూవీ అయిన సైరా అంచనాలను అందుకునే టాక్ ని సొంతం చేసుకున్నా కలెక్షన్స్ ని అందుకోలేక డిసాస్టర్ రిజల్ట్ ను ఇక్కడ సొంతం చేసుకుంది. సినిమా ముందుగా తమిళనాడు లో టోటల్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే
?Movie Business: 8Cr?
?Total Share: 1.36Cr
?Total Loss: 6.64Cr Loss from Business
?Verdict: HUGE DISASTER
ఇక సినిమా కేరళ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే
?Movie Business: 1.7Cr?
?Total Share: 0.73Cr
?Total Loss: 0.97Cr Loss from Business
?Verdict: DISASTER
ఇదీ మొత్తం మీద రెండు చోట్ల సినిమా టోటల్ రన్ కలెక్షన్స్ పరిస్థితి.
యూనిట్ కూడా సినిమా ను పెద్దగా ప్రమోట్ చేయలేక పోయింది, అది కూడా ఎఫెక్ట్ చూపగా ఓవరాల్ గా చూసుకుంటే పాజిటివ్ టాక్ వచ్చినా మంచి రిలీజ్ దొరికినా కానీ సైరా రెండు తెలుగు రాష్ట్రాల ఆవల అంచనాలను అందుకోవడం లో విఫలం అయింది అని చెప్పాలి.