టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మెగా సెన్సేషనల్ మూవీ సైరా నరసింహా రెడ్డి పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ తో అత్యంత భారీ ఎత్తున రూపొందుతున్న ఈ సినిమా పై ట్రేడ్ లో కూడా క్రేజ్ మాములుగా లేదు. అక్టోబర్ 2 న కనివినీ ఎరగని రేంజ్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా బిజినెస్ అన్ని ఏరియాల్లో ఆల్ మోస్ట్ ఫినిష్ అయ్యింది అని చెప్పాలి.
ఇక ఓవర్సీస్ లో కూడా సినిమా బిజినెస్ ఆల్ మోస్ట్ ఫినిష్ అయ్యింది, ముందుగా అమెరికాలో సినిమా కు ఉన్న క్రేజ్ దృశ్యా 18 కోట్ల రేంజ్ లో అమ్మాలని డిసైడ్ అయ్యారు. కానీ ఇప్పుడు బిజినెస్ అక్కడ మొత్తం మారి పోయి 10.5 కోట్ల రేటు కి అమెరికా హక్కులు అమ్ముడు పోయినట్లు సమాచారం.
తగ్గడానికి కారణాలు పెద్దగా తెలియకున్నా రీసెంట్ టైం లో తెలుగు సినిమాలు అమెరికాలో లాభాల కన్నా నష్టాలే ఎక్కువ తెచ్చుకోవడం తో బిజినెస్ పరంగా పెద్ద సినిమాలకు భారీ రేట్లు ఇచ్చి కొనలేమని అక్కడ బయ్యర్లు చెప్పడం తో సేఫ్ సైడ్ లో ఉండాలని సైరా బిజినెస్ తగ్గించారట.
ఇక టోటల్ గా ఓవర్సీస్ లో సినిమా సాధించిన టోటల్ బిజినెస్ లెక్కలు ఇలా ఉన్నాయి..
USA- 10.5Cr(break even – 2.6M~)
Canada- 1.5Cr
Total North america – 12Cr
NZ & AUS – 1.4Cr
Gulf – 3Cr
Rest – 1.6Cr
Total – 18Cr(break Even – 4.5M~) ఇదీ మొత్తం మీద ఓవర్సీస్ లో సైరా సాధించిన బిజినెస్ లెక్కలు….
అమెరికాలో బ్రేక్ ఈవెన్ కి సినిమా మొత్తంగా 2.6 మిలియన్ ని అందుకోవాల్సి ఉంటుంది. పబ్లిసిటీ అండ్ లోకేషన్స్ కౌంట్ ని బట్టి ఈ నంబర్ కొద్దిగా అటూ ఇటూగా మారే చాన్స్ ఉంది. అదే విధంగా టోటల్ టార్గెట్ కూడా కొంచం అటూ ఇటూగా మారే చాన్స్ ఉంది. కానీ సినిమా టాక్ కి అతీతంగా ఈ మార్క్ ని అందుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.