Home న్యూస్ ది లెజెండ్ టాక్ ఏంటి…మినీ రివ్యూ…హిలేరియస్ కామెడీ!!

ది లెజెండ్ టాక్ ఏంటి…మినీ రివ్యూ…హిలేరియస్ కామెడీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో 2 పాన్ ఇండియా డబ్బింగ్ మూవీస్ రిలీజ్ అయ్యాయి, విక్రాంత్ రోణ ఉన్నంతలో బాగా ఆకట్టుకోగా 3D వర్షన్ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది. ఇక మరో డబ్బింగ్ పాన్ ఇండియా మూవీ ది లెజెండ్… శరవణ స్టోర్స్ ఓనర్ శరవణన్ హీరోగా మారి తానె నిర్మించిన ఈ సినిమా కోసం ఏకంగా 45 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి నిర్మించగా ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో..

వరల్డ్ వైడ్ గా 2500 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ ఊహించినట్లే ఉంది కానీ చాలా వరకు థియేటర్స్ లో రియాక్షన్ డిఫెరెంట్ గా ఉందని చెప్పాలి. ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే…

హీరో పెద్ద సైంటిస్ట్… తన ఊరికి దేశానికి ఏమైనా చేయాలి అని తన ఊరికి వచ్చిన తర్వాత విలన్స్ తో గొడవలు జరుగుతాయి, హీరో ఇవన్నీ తట్టుకుని తను అనుకుంది ఎలా చేశాడు అన్నది స్టొరీ. సూపర్ స్టార్ రజినీ శివాజీని పోలి ఉన్న ఈ కథ విజువల్స్ పరంగా గ్రాండియర్ పరంగా కనుల పండగలా ఉన్నప్పటికీ…

కళ్ళముందు ఉన్న హీరో నటన చూసిన తర్వాత థియేటర్స్ లో సీరియస్ సీన్స్ కూడా హిలేరియస్ కామెడీ అనుకుని జనాలు విరగబడి నవ్వుతున్నారు…. యాక్షన్ సీన్స్ ఆదరగొట్టినా అందరూ దాదాపు తెలిసిన వాళ్ళే అయినా ఎక్కడా కూడా సినిమా సినిమాలా అనిపించదు, స్పూఫ్ లా అనిపిస్తూ సీరియస్ సీన్స్ కి నవ్వడం, యాక్షన్ సీన్స్ కి అరవడం థియేటర్స్ లో గోల గోలలా ఉంటుంది…

కానీ సినిమాలో కంటెంట్ లేదు, కథ లేదు, యాక్టింగ్ లేదు, పెర్ఫార్మెన్స్ లేదు… భారీ స్టార్ కాస్ట్, రిచ్ విజువల్స్, హారీష్ జయరాజ్ మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ లు బాగున్నాయి. భారీ బడ్జెట్ పెట్టి తీసిన హీరోనే సినిమాకి మేజర్ మైనస్ పాయింట్…. ఆల్ రెడీ బోరింగ్ గా సాగుతున్న రీసెంట్ మూవీస్ లో ఈ సినిమా బోర్ గానే ఉన్నప్పటికీ తెరపై జరుగుతున్న సీన్స్ తో నవ్వుకోవడం కోసం కొంచం కష్టమైనా ఒకసారి చూడొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here