సినిమాలు థియేటర్స్ లోనే చూడాలి అని ఎవరికీ మాత్రం ఉండదు, కానీ ఏ సినిమా పడితే ఆ సినిమా కాకుండా జస్ట్ బాగుంది అనిపించే రేంజ్ టాక్ వస్తే చాలు మన సినిమానా లేక డబ్బింగ్ సినిమా నా అన్న తేడా ఏమి లేకుండా థియేటర్స్ కి ఎగబడి చూసే అలవాటు ఇండియా మొత్తం మీద తెలుగు ఆడియన్స్ కే ఎక్కువగా ఉందని చెప్పాలి. మన దగ్గర లోకల్ సినిమాలు నాన్ లోకల్ సినిమాలు…
అన్న తేడా ఏమి ఉండదు, హిట్ టాక్ వస్తే చాలు సినీ లవర్స్ థియేటర్స్ కి ఎగబడతారు… ఈ నమ్మకంతోనే లాస్ట్ ఇయర్ ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు కానీ ఈ ఇయర్ సెకెండ్ వేవ్ వచ్చినప్పుడు కానీ థియేటర్స్ లో సినిమాలను ముందుగా రిలీజ్ చేయడానికి సిద్ధం అయిన ఇండస్ట్రీలలో…
టాలీవుడ్ ముందు నిలిచింది అని చెప్పాలి. అంతే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్స్ కొట్టడం విషయంలో కూడా టాలీవుడ్ కి పోటి లేదనే చెప్పాలి. లాస్ట్ ఇయర్ ఫస్ట్ వేవ్ తర్వాత థియేటర్స్ లో రిలీజ్ అయిన సాయి ధరం తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా….
కంటెంట్ పరంగా యావరేజ్ గానే ఉన్నా కానీ జనాలు థియేటర్స్ కి ఎగబడి ఈ సినిమా చూడటానికి ముందుకు వచ్చి ఆ సినిమాను సూపర్ హిట్ చేసి ఫస్ట్ వేవ్ తర్వాత ఇండియాలో మొదటి క్లీన్ హిట్ మూవీ గా నిలిచేలా చేశారు. ఇక ఈ ఇయర్ సెకెండ్ వేవ్ అయ్యాక ఇండియా లో ఇంకా ఇతర ఇండస్ట్రీలు సినిమాలు రిలీజ్ చేయడానికి బయపడుతున్న వేల…
టాలీవుడ్ లో ఆల్ రెడీ మూడు సినిమాలు రిలీజ్ అవ్వగా అందులో SR కళ్యాణ మండపం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచి సెకెండ్ వేవ్ తర్వాత ఇండియా లో ఫస్ట్ క్లీన్ హిట్ గా నిలిచింది. ఈ రెండు రికార్డులు కూడా ఇప్పుడు టాలీవుడ్ పేరిటే నిలవడం మన సినీ లవర్స్ గొప్పతనం అండ్ సినిమా అంటే వాళ్ళకి ఉన్న ఇష్టానికి నిదర్శనం అని చెప్పాలి.