Home గాసిప్స్ 4 కాదు 5….థియేటర్లు మ్రోత మ్రోగడం ఖాయం

4 కాదు 5….థియేటర్లు మ్రోత మ్రోగడం ఖాయం

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా అరవింద సమేత సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా సినిమా లోని పాటలు రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

కాగా ఆడియో లో కేవలం 4 పాటలు మాత్రమె ఉండటంతో ఇండస్ట్రీలో కొన్ని వార్తలు శిఖారు చేయడం మొదలు పెట్టాయి. రీసెంట్ గా జరిగిన కొన్ని కారణాల వల్ల సినిమాలో ఒక సాంగ్ ని తొలగించారని వార్తలు ప్రచారం అయ్యాయి. కానీ అవన్నీ అబద్దమే అని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.

సినిమాలో మొత్తం 5 పాటలు ఉంటాయని….ఒక స్పెషల్ సాంగ్ సినిమాలో ఉందని…అది షూటింగ్ కూడా అయిపోయిందని, కావాలని ఆడియో లో చేర్చలేదని అంటున్నారు, ఆ సాంగ్ ని త్వరలోనే స్పెషల్ గా రిలీజ్ చేస్తారని అంటున్నారు. మరి అది స్పెషల్ ఐటమ్ సాంగా లేక మామూలు సాంగ్ అన్నది తెలియాల్సి ఉండగా…మొత్తంమీద అన్ని సాంగ్స్ ఉంటాయని తెలిసి ఫ్యాన్స్ మాత్రం థియేటర్స్ మ్రోత మ్రోగించాలని భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here