Home న్యూస్ కాపీ సినిమా అన్నారు…100 కోట్లు తో దుమ్ము లేపింది!

కాపీ సినిమా అన్నారు…100 కోట్లు తో దుమ్ము లేపింది!

0

     కొన్ని సినిమాలను ఇన్స్పైర్ అయ్యి కొత్త కథలను రాసుకోవడం చాలామంది డైరెక్టర్స్ చేసే పనే… బాలీవుడ్ లో వచ్చిన కాలేజ్ యూత్ మూవీస్ లో 3 ఇడియట్స్ సినిమా ఒక కల్ట్ క్లాసిక్ సినిమా… ఆ సినిమా సాధించిన విజయం కావచ్చు ఇంపాక్ట్ కావచ్చు తర్వాత వచ్చిన అనేక కాలేజ్ బ్యాగ్ డ్రాప్ మూవీస్ పై స్పష్టంగా ఇంపాక్ట్ చూపింది. ఇప్పుడు అలాంటి ఇంపాక్ట్ నే కొద్దివరకు కలిగిన చిచోరే అనే సినిమా బాలీవుడ్ లో…

రిలీజ్ అయ్యి సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో సూపర్ హిట్ గా నిలిచి 100 కోట్లు వసూళ్లు సాధించింది. దంగల్ తో బాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డ్ కొట్టిన దర్శకుడు నికేష్ తివారి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరియు శ్రద్ధా కపూర్ ల కలయికలో చిచోరే అనే కాలేజ్ స్టొరీ ని తెరకెక్కించారు.

సినిమా స్టొరీ కొంచం 3 ఇడియట్స్ ని పోలి ఉన్నా కానీ ఇందులో కొన్ని స్పెషల్స్ కూడా ఉన్నా కానీ ఆ సినిమా కాపీ నే అంటూ విమర్శకులు సినిమా కి అనుకున్న రేంజ్ లో రివ్యూ లు ఇవ్వలేదు. అయినా కానీ ఆడియన్స్ సినిమా ను ఇష్టపడటం తో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా….

11 రోజులు ముగిసే సరికే 100 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకుని సూపర్ హిట్ గా నిలిచింది. లాంగ్ రన్ లో 150 కోట్లకు ఏమాత్రం తక్కువ కాని కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉందని సమాచారం. సినిమా కథ పాయింట్… ఒక ఎగ్జామ్ లో ఫెయిల్ అయిన హీరో కొడుకు తాను పెద్ద ఫైల్యూర్ ని అని ఆత్మహత్యకి ప్రయత్నించగా….

హీరో తన కాలేజ్ లైఫ్ లో ఎలాంటి ఫైల్యూర్స్ ని ఎదురుకున్నానో తర్వాత ఎలా ఎదిగానో చెప్పే కథే ఈ సినిమా.. ఆడియన్స్ ని ఓ రేంజ్ లో ఆకట్టుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సుశాంత్ సింగ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశం ఉంది. దాంతో పాటే కాపీ కథ అంటూ విమర్శించిన వాళ్లకి కూడా భారీ విజయం తో సమాదానం ఇచ్చింది ఈ సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here