Home న్యూస్ బాహుబలి2-26.50…..ది కాశ్మీర్ ఫైల్స్-24.80….ఇది సరికొత్త చరిత్ర!!

బాహుబలి2-26.50…..ది కాశ్మీర్ ఫైల్స్-24.80….ఇది సరికొత్త చరిత్ర!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ చిన్న సినిమా సృష్టిస్తున్న కలెక్షన్స్ ఊచకోత చూసి ట్రేడ్ వర్గాలు మొత్తం విస్మయానికి గురి అవుతున్నారు అనే చెప్పాలి… చరిత్రలో నిలిచి పోయే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పోతున్న సినిమా రెండో వారంలో మరింత భీభత్సమైన కలెక్షన్స్ తో హోల్డ్ చేసి ఊచకోత కోస్తూ దూసుకు పోతుంది ఈ సినిమా…

ఈ సినిమానే ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా…. రెండో వీక్ లో సంచలన గ్రోత్ ని థియేటర్స్ లో సొంతం చేసుకున్న సినిమా కలెక్షన్స్ పరంగా ఇప్పుడు హిందీ సినిమాల పరంగా 9 వ రోజు కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించింది ఇప్పుడు…

ఓవరాల్ గా అన్ని సినిమాల పరంగా ఎపిక్ బాహుబలి 2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9 వ రోజు హిందీ లో 26.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ తో చరిత్ర సృష్టించగా ఆ కలెక్షన్స్ రికార్డ్ ఆల్ మోస్ట్ 5 ఏళ్ళుగా అలానే కొనసాగుతుంది.. ఇక హిందీ సినిమాల పరంగా అమీర్ ఖాన్ దంగల్ సినిమా…

23.07 కోట్ల నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఆ కలెక్షన్స్ రికార్డ్ ను ఇప్పుడు ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా బ్రేక్ చేసి 9 వ రోజు ఇండియా లో 24.80 కోట్ల నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని హిందీ సినిమాల పరంగా సరికొత్త రికార్డ్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది… మొత్తం మీద 9 రోజుల్లో సినిమా 141.27 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోగా…..

టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా టోటల్ గా 201 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని మరో మైల్ స్టోన్ ని అందుకుంది. ఇక 10 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆదివారం అవ్వడంతో ఈ రోజు మరింత భీభత్సం సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. 10 కోట్ల రేంజ్ బడ్జెట్ మూవీ ఈ రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం అనే చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here