బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) తో మొదలైన స్పై యూనివర్స్ లో భాగంగా ఇప్పుడు వార్(War Movie) పఠాన్(Pathaan Movie) ల తర్వాత జరిగిన సంఘటనల నేపధ్యంలో తెరకెక్కిన టైగర్3(Tiger 3 Movie) భారీ లెవల్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వగా సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే…..
రా ఏజెంట్ అయిన సల్మాన్ ISI ఏజెంట్ అయిన కత్రినా కైఫ్ లు కలిసి టెర్రరిస్ట్ అయిన ఇమ్రాన్ హష్మీ చేస్తున్న టెర్రర్ ప్లాన్ ను ఎలా ఆపాలి అనుకున్నారు ఆ తర్వాత కథ ఏమయింది అన్నది మొత్తం మీద సినిమా స్టోరీ పాయింట్…. పెర్ఫార్మెన్స్ పరంగా సల్మాన్ ఖాన్ తన రోల్ వరకు బాగా నటించి మెప్పించాగా యాక్షన్ సీన్స్ హీరోయిజం సీన్స్ లో కుమ్మేశాడు…
ఇక కత్రినా కైఫ్ తన రోల్ వరకు ఫుల్ న్యాయం చేసింది, యాక్షన్ సీన్స్ అదరగొట్టింది…. ఇమ్రాన్ హష్మీ విలనిజం కూడా మెప్పించింది, అన్నీ బాగున్నా కూడా అసలు కథ పాయింట్ మాత్రం చాలా చాలా నార్మల్ గా రొటీన్ గా అనిపించడం సినిమాకి మేజర్ మైనస్ పాయింట్… ఆల్ మోస్ట్ ఆడియన్స్ కొన్ని సీన్స్ మినహా తర్వాత కథ ఏమవుతుంది అన్నది ఈజీగా గెస్ చేసేలా ఉందని చెప్పాలి…
కానీ సినిమా స్టార్ట్ అవ్వడం ఓ రేంజ్ కిక్ ఇచ్చేలా స్టార్ట్ అవ్వడంతో సినిమా అంతా ఇదే రేంజ్ లో ఉంటుంది అనుకుంటాం, కానీ ఎక్స్ లెంట్ స్టార్ట్ తర్వాత సినిమా ఒక్కసారిగా స్లో అయ్యి ప్రీ ఇంటర్వెల్ వరకు నత్తనడకన సాగుతుంది, మళ్ళీ ఇంటర్వెల్ ఎపిసోడ్ మెప్పించడంతో సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరుగుతాయి…
సెకెండ్ ఆఫ్ కథ మళ్ళీ స్లో అవుతున్న టైంలో షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) స్పెషల్ ఎంట్రీ తర్వాత 15-20 నిమిషాల ఎపిసోడ్ సల్మాన్ షారుఖ్ ల సీన్స్ మెప్పించిన తర్వాత తిరిగి స్లో అయ్యే సినిమా రొటీన్ సీన్స్ తో సాగుతూ మళ్ళీ క్లైమాక్స్ లో పర్వాలేదు అనిపించేలా సాగుతుంది, కథ చాలా నార్మల్ గా ఉన్నప్పటికీ కూడా…
యాక్షన్ సీన్స్ ఓవర్ ది టాప్ అనిపించినా కూడా వాటి టేకింగ్ అండ్ హై ఒల్టేజ్ యాక్షన్ సీన్స్ సినిమాకి హైలెట్ అని చెప్పాలి…. కానీ టైగర్ సిరీస్ లో వచ్చిన మూవీస్ తో పాటు రీసెంట్ వార్ అండ్ పఠాన్ లను కూడా కలిపితే టైగర్3 మూవీ కొంచం వీక్ కంటెంట్ తో వచ్చిన సినిమా అని చెప్పొచ్చు… కానీ మీరు కనుక ఈ స్పై యూనివర్స్ ఫ్యాన్స్ అయితే…
అలాగే టైగర్ సిరీస్ కూడా బాగా మెప్పిస్తే… కొంచం పడుతూ లేస్తూ సాగినా కూడా టైగర్3 సినిమా అంచనాలను అనుకున్న రేంజ్ లో అందుకోలేక పోయినా ఓవరాల్ గా పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు అనిపించేలా ఉంటుంది అని చెప్పాలి. కొంచం లో ఎక్స్ పెర్టేషన్స్ తో వెళితే సినిమా యాక్షన్ బ్లాక్స్ అండ్ షారుఖ్ అండ్ సల్మాన్ ల సీన్స్ తో పర్వాలేదు ఈజీగా ఒకసారి చూడొచ్చు అనిపించేలా ఉంటుంది. సినిమా కి ఓవరాల్ గా మా రేటింగ్ 2.75 స్టార్స్….