Home న్యూస్ డిజే టిల్లు 1.59…టిల్లు స్క్వేర్ 4.35…ఇదెక్కడి ఊచకోత సామి!

డిజే టిల్లు 1.59…టిల్లు స్క్వేర్ 4.35…ఇదెక్కడి ఊచకోత సామి!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సిద్హూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) నటించిన లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Day 1 Collections) అన్ని చోట్లా రిమార్కబుల్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది… మొదటి రోజు అనుకున్న అంచనాలను అన్నీ కూడా సాలిడ్ గా బీట్ చేసి సరికొత్త ఓపెనింగ్ డే రికార్డులను….

సిద్హూ జొన్నలగడ్డ కెరీర్ లో నమోదు చేసింది. సినిమా మొదటి రోజు సాధించిన లెక్కలు ఒక్కో ఏరియాకి గాను రివీల్ అవుతూ ఉండగా ముందుగా నైజాం ఏరియాలో సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ లెక్కలు వచ్చాయి… కాగా సినిమా నైజాంలో రిమార్కబుల్ ఓపెనింగ్స్ ను నమోదు చేసి సంచలనం సృష్టించింది…

రెండేళ్ళ క్రితం వచ్చిన డిజే టిల్లు మూవీ నైజాం ఏరియాలో 1.59 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకుంటే ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ అయిన టిల్లు స్క్వేర్ మూవీ మొదటి రోజు అంచనాలను అన్నీ కూడా మించి పోయి 4.35 కోట్ల రేంజ్ లో షేర్ ని GST తో కలిపి సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది…

సినిమా ఇక్కడ 3 కోట్లకు పైగా షేర్ కన్ఫాం అని అనుకుంటే ఆ లెక్క అంచనాలను అన్నీ మించిపోయింది…. మొదటి పార్ట్ కి ఆల్ మోస్ట్ రెండున్నర రెట్లు ఎక్కువ వసూళ్ళని ఒక్క నైజాం ఏరియాలోనే సొంతం చేసుకోవడం అన్నది మామూలు విషయం కాదనే చెప్పాలి…

మిగిలిన ఏరియాల్లో కూడా డిజే టిల్లు ఓపెనింగ్స్ కి ఎన్నో రెట్లు అధికమైన ఓపెనింగ్స్ ను ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమా సొంతం చేసుకుంటూ ఉండగా సాలిడ్ పాజిటివ్ టాక్ ఉండటంతో లాంగ్ రన్ లో ఈ సినిమా ఓవరాల్ గా భారీ లాభాలతో దుమ్ము దుమారం లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here