Home న్యూస్ టిల్లు స్క్వేర్ ట్రైలర్2 రివ్యూ….కుమ్మింది ట్రైలర్…ఇక దంచుడే!

టిల్లు స్క్వేర్ ట్రైలర్2 రివ్యూ….కుమ్మింది ట్రైలర్…ఇక దంచుడే!

0

సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన బ్లాక్ బస్టర్ డిజే టిల్లు(Dj Tillu Movie) కి సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్(Tillu Square Movie) ఈ శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా నుండి రీసెంట్ గా రెండో ట్రైలర్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేశారు…

ముందు ఒక ట్రైలర్ ను రిలీజ్ చేయగా అందులో కథ ఏమి చూపించకుండా లీడ్ పెయిర్ కెమిస్ట్రీనే హైలెట్ చేస్తూ సీన్స్ ను రిలీజ్ చేయడంతో పార్ట్ 1 ట్రైలర్ రేంజ్ తో పోల్చితే పార్ట్ 2 ట్రైలర్ పెద్దగా కిక్ ఇవ్వలేదు… దాంతో టీం ఇప్పుడు రెండో ట్రైలర్ ను రిలీజ్ చేయగా ఈ ట్రైలర్ లో కూడా సినిమా కథ గురించి…

ఏమి చెప్పకున్నా కూడా హిలేరియస్ సింగిల్ లైన్ పంచులతో ట్రైలర్ మొత్తం ఎంటర్ టైన్ మెంట్ ఫుల్లుగా ఉండబోతుంది మరోసారి క్లియర్ చేసేలా ఉంది…. మొదటి పార్ట్ లో మాదిరిగానే రెండో పార్ట్ లో టిల్లు లైఫ్ లోకి కొత్త అమ్మాయి వచ్చిన తర్వాత మళ్ళీ టిల్లు ఫేస్ చేసిన ఇబ్బందులు ఏంటి…అవి ఏ రేంజ్ కి వెళ్ళాయి అన్నది…

రెండో పార్ట్ కథగా అనిపిస్తూ ఉండగా కథ కన్నా కూడా కామెడీ సీన్స్, సింగిల్ లైన్ పంచులు సిద్హూ జొన్నలగడ్డ డైలాగ్స్ తోనే సినిమా నడపబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తె అర్ధం అవుతుంది. స్టోరీ కూడా మినిమమ్ పర్వాలేదు అనిపించేలా ఉంటే చాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా రెచ్చిపోవడం సాలిడ్ ఓపెనింగ్స్ ను కుమ్మేయడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here