కెరీర్ మొదట్లో హాట్రిక్ విజయాలను అందుకున్నా తర్వాత పూర్తిగా ఫామ్ కోల్పోయిన యంగ్ హీరో రాజ్ తరుణ్(Raj Tarun) సినిమాలను జనాలు పట్టించుకోవడం పూర్తిగా మానేశారు. వారం ముందే ఆడియన్స్ ముందుకు పురుషోత్తముడు అంటూ వచ్చిన రాజ్ తరుణ్ కి ఆ సినిమా మరోసారి నిరాశని మిగిలించగా…వారం గ్యాప్ లో ఇప్పుడు…
మరోసారి తిరగబడర సామీ(Tiragabadara saami Movie Review) తో వచ్చిన రాజ్ తరుణ్ ఈ సారి ఎంతవరకు మెప్పించాడో తెలుసుకుందాం పదండీ… ముందుగా కథ పాయింట్ కి వస్తే చిన్నప్పుడే ఫ్యామిలీ నుండి తప్పిపోయిన హీరో పెరిగి పెద్దయ్యి హైదరాబాదులో ఉండగా తనలా ఫ్యామిలీ నుండి…
తప్పిపోయిన వాళ్ళని కాపాడి ఫ్యామిలీస్ కి అప్పగిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో హీరోయిన్ తో ప్రేమలో పడగా అనుకోకుండా విలన్ ఒక వ్యక్తి తప్పిపోయాడని, తిరిగి అప్పగించే పనిని హీరోకి అప్పగించగా ఆ తర్వాత కథ ఏమయింది అన్నది మిగిలిన కథ పాయింట్…
పరమ రొటీన్ కథతో తెరకెక్కిన తిరగబడర సామీ సినిమా కొన్ని సీన్స్ ఓకే అనిపించినా కూడా ఓవరాల్ గా సినిమా మొత్తం సహనానికి పరీక్ష పెడుతుంది… రాజ్ తరుణ్ తన రోల్ వరకు పర్వాలేదు అనిపించినా కూడా కథలోనే దమ్ము లేకపోవడం, పేలవమైన స్క్రీన్ ప్లే తో…
చూసే ఆడియన్స్ తలలు పట్టుకుంటారు…. పాటలు బిలో పార్ గా ఉండగా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పరమ బోర్ కొట్టించాయి…ఇక లాజిక్ లేని సన్నివేశాలు, ఓవర్ ది టాప్ అనిపించే సీన్స్ తో నిండిపోయిన సినిమా ఫస్టాఫ్ కే తలపట్టుకునేలా చేయగా సెకెండ్ ఆఫ్ అయినా కొంచం ఓకే అనిపిస్తుందా అనుకుంటే…
సెకెండ్ ఆఫ్ కథ మరింత బోర్ కొట్టించి సహనానికి పరీక్ష పెట్టింది… మొత్తం మీద కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ మైనస్ లుగా నిలిచిన తిరగబడర సామీ ఏ దశలో కూడా ఆడియన్స్ ను అలరించలేకపోయింది…. అన్నీ తట్టుకుని సినిమా చూడాలి అన్నా చాలా చాలా ఓపిక అవసరం….మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 1.75 స్టార్స్…