Home న్యూస్ టూ క్లాస్ సినిమా కష్టమే అన్నారు…138 కోట్ల తో దుమ్ము లేపింది!!

టూ క్లాస్ సినిమా కష్టమే అన్నారు…138 కోట్ల తో దుమ్ము లేపింది!!

0

     ఒక మాస్ హీరో మరీ క్లాస్ మూవీ చేస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది, ఆ కారణంగానే రీసెంట్ గా బాలీవుడ్ లో రిలీజ్ అయిన సూపర్ 30 సినిమా బాగున్నప్పటికీ హీరోగా చేసిన హృతిక్ రోషన్ డీ గ్లామరైజ్ రోల్ సెట్ కాలేదని, సినిమా మరీ క్లాస్ గా ఉందన్న టాక్ ఎక్కువగా వినిపించింది, కానీ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ బరిలో దుమ్ము లేపే కలెక్షన్స్ ని సాధించింది.

గత 6 ఏళ్లలో క్రిష్ 3 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తప్పితే పెద్దగా హిట్లు లేని హృతిక్ రోషన్ రెండున్నర ఏళ్ల క్రితం కాబిల్ అనే ప్రయోగాత్మక సినిమా చేశాడు, ఆ సినిమా పర్వాలేదు అనిపించే రెస్పాన్స్ ని దక్కించుకున్న హృతిక్ రేంజ్ హిట్ అయితే కాలేదు.

ఆ సినిమా తర్వాత ఇప్పుడు రెండున్నర ఏళ్ల తర్వాత రియల్ లైఫ్ స్టొరీ ని సూపర్ 30 గా తీయగా అందులో డీగ్లామరైజ్ రోల్ లో కనిపించిన హృతిక్ ని చూసి సినిమా బాగున్నా బిజినెస్ ని అందుకోలేదు 100 కోట్లు కష్టమే అని ట్రేడ్ లో ఎక్కువ మంది తెగ ప్రిడిక్ట్ చేశారు.

సినిమా బిజినెస్ కూడా ఈ మధ్యకాలంలో హృతిక్ సినిమాల్లోకి తక్కువ బిజినెస్ 45 కోట్లకు పైగా దక్కించుకుంది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా పాజిటివ్ టాక్ పవర్ తో ఇప్పటి వరకు ఏకంగా 138 కోట్ల నెట్ కలెక్షన్స్ ని సాధించింది. సినిమా బ్రేక్ ఈవెన్ కి 90 కోట్లు కావాల్సి ఉండగా…

ఇప్పటికే 48 కోట్ల వరకు ప్రాఫిట్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా త్వరలోనే 150 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక త్వరలోనే హృతిక్ ఫుల్ యాక్షన్ మాస్ మూవీ “వార్” తో అక్టోబర్ 2 న రాబోతున్నాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని ఇప్పటి నుండే ట్రేడ్ వర్గాలు ప్రిడిక్ట్ చేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here