రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో కానీ డైరెక్షన్ లో కానీ మంచి హిట్ వచ్చి ఎన్నో ఏళ్ళు అవుతున్న విషయం తెలిసిందే, సరిగ్గా చెప్పాలి అంటే 2010 లో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తున్న టైం లో తీసిన రక్త చరిత్ర తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న రామ్ గోపాల్ వర్మ తర్వాత ఇప్పటి వరకు హిట్ కొట్టలేదు. ఇక రీసెంట్ గా రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో వచ్చిన…
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా కొన్ని కాంట్రవర్సీ ల తర్వాత పేరు మార్చగా అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు గా మారగా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు టాక్ ని పట్టించుకోకుండా భారీ వసూళ్ళని సాధించింది, కానీ టాక్ అట్టర్ డిసాస్టర్ అనిపించే విధంగా ఉండగా…
తర్వాత కూడా పెద్దగా తేరుకోలేక పోయిన సినిమా మొదటి వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర సేఫ్ గా నిలిచింది, క్లీన్ హిట్ అయింది, దాదాపు 10 ఏళ్ల తర్వాత రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో కానీ డైరెక్షన్ లో కానీ హిట్ అయిన సినిమా గా నిలిచింది ఈ సినిమా.
సినిమా టోటల్ రన్ కలెక్షన్స్ రిపోర్ట్ ని ఒకసారి గమనిస్తే
?Nizam: 85L
?Ceeded: 34L
?UA: 41L
?East: 26L
?West: 16L
?Guntur: 24L
?Krishna: 26L
?Nellore: 12L
AP-TG Total:- 2.64cr
Ka & ROI: 6L
OS: 3L
Total WW: 2.73CR(4.82cr Gross)
ఇదీ మొత్తం మీద సాధించిన టోటల్ కలెక్షన్స్…
సినిమాను కొన్ని ఏరియాల్లో ఓన్ గా రిలీజ్ చేయగా మిగిలిన ఏరియాల బిజినెస్ 2.2 కోట్లు కాగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2.5 కోట్లు అయింది, ఫైనల్ రన్ పూర్తీ అయ్యే సరికి టార్గెట్ పై 23 లక్షల ప్రాఫిట్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా పరుగును పూర్తీ చేసుకుంది.