ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ పుష్ప పార్ట్ 1…. అల వైకుంఠ పురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అల్లు అర్జున్, రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన పుష్ప పై అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా ఆ అంచనాలకు తగ్గట్లు టాక్ మొదటి రోజున సొంతం చేసుకోలేక పోయింది పుష్ప సినిమా…
దాంతో లాంగ్ రన్ లో సినిమా భారీ బిజినెస్ ను రికవరీ చేస్తుందా లేదా అన్న అనుమానాలు ఉండగా మరో పక్క థార్డ్ వేవ్ ఇంపాక్ట్ కూడా స్టార్ట్ అయిన నేపధ్యంలో కూడా పుష్ప సినిమా కలెక్షన్స్ జోరు ఆగలేదు, తెలుగు లో ఆగినా హిందీ లో మాత్రం 10 వారాలకు పైగా…
పరుగును కొనసాగించి అక్కడ సంచలన కలెక్షన్స్ ని సొంతం చేసుకుని పరుగును కొనసాగించిన ఈ సినిమా లాంగ్ రన్ లో అక్కడ 100 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టించగా ఓవరాల్ గా మిక్సుడ్ టాక్ తో కూడా చరిత్రలో నిలిచిపోయే రేంజ్ లో కలెక్షన్స్ తో ఇప్పుడు పరుగును…
పూర్తీ చేసుకున్న పుష్ప పార్ట్ 1 సినిమా ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam: 40.74Cr(Without GST 37.47Cr)
👉Ceeded: 15.17Cr
👉UA: 8.13Cr
👉East: 4.89Cr
👉West: 3.95Cr
👉Guntur: 5.13Cr
👉Krishna: 4.26Cr
👉Nellore: 3.08Cr
AP-TG Total:- 85.35CR(133.25CR~ Gross)
👉Karnataka: 11.81Cr
👉Tamilnadu: 13.75Cr
👉Kerala: 5.60Cr
👉Hindi: 51.30CR
👉ROI: 2.25Cr
👉OS – 14.56Cr
Total WW: 184.62CR(360CR~ Gross)
ఇదీ మొత్తం మీద ఫైనల్ రన్ లో సినిమా సాధించిన కలెక్షన్స్ ఊచకోత… సినిమాను మొత్తం మీద 144.9 కోట్ల రేంజ్ రేటు కి అమ్మగా సినిమా 146 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి 38.62 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సెన్సేషనల్ లాభాలతో టాలీవుడ్ లో హైయెస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్ లో ఒకటిగా చేరింది…