Home న్యూస్ భగవంత్ కేసరి ట్రైలర్ 24 గంటల టార్గెట్ ఇదే…కొడుతుందా లేదా!!

భగవంత్ కేసరి ట్రైలర్ 24 గంటల టార్గెట్ ఇదే…కొడుతుందా లేదా!!

0

నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన రీసెంట్ మూవీస్ అఖండ మరియు వీర సింహా రెడ్డి సినిమాలతో బాక్ టు బాక్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు బాలయ్య నటించిన కొత్త సినిమా….

భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా ఆడియన్స్ ముందుకు దసరా కానుకగా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద భారీ అంచనాలు ఇప్పుడు ఉన్నాయి అని చెప్పాలి.

సినిమా ట్రైలర్ అక్టోబర్ 8న సాయంత్రం 8 గంటల 16 నిమిషాలకు రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతూ ఉంది. ఇక ఈ ట్రైలర్ మీద సినిమా మీద ఉన్న అంచనాల దృశ్యా బ్రేక్ చేయాల్సిన రికార్డులు కొన్ని ఉన్నాయి. టాలీవుడ్ లో సీనియర్ హీరోల పరంగా…

హైయెస్ట్ వ్యూస్ ను సొంతం చేసుకున్న ట్రైలర్స్ పరంగా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా ట్రైలర్ 21.86 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకోగా రెండో ప్లేస్ లో వాల్తేరు వీరయ్య సినిమా ట్రైలర్ 11.77 మిలియన్ వ్యూస్ ని అందుకుని టాప్ 2 లో ఉన్నాయి.

ఇక లైక్స్ పరంగా ఆచార్య సినిమా ట్రైలర్ 838K లైక్స్ మార్క్ ని అందుకోగా రెండో ప్లేస్ లో వాల్తేరు వీరయ్య ట్రైలర్ 471.8K లైక్స్ తో టాప్ 2 లో నిలిచాయి. రెండు ప్లేసులలో మెగాస్టార్ సినిమా ఉండగా ఇప్పుడు బాలయ్య భగవంత్ కేసరి ట్రైలర్ 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here