టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో అరవింద సమేత తర్వాత తెరకెక్క బోతున్న సినిమా అఫీషియల్ గా అనౌన్స్ అవ్వగా ఈ పాటికే షూటింగ్ మొదలు అవ్వాల్సింది కానీ కరోనా ఎఫెక్ట్ తో ఆగిపోగా… కథ ని కంప్లీట్ గా ప్రిపేర్ చేయని త్రివిక్రమ్ ఇప్పుడు ఫస్టాఫ్ అంతా కంప్లీట్ చేసి సెకెండ్ ఆఫ్ కథని ప్రిపేర్ చేస్తున్నారని తెలుస్తుంది. అది కూడా త్వరలోనే…
కంప్లీట్ అవుతుందని అంటున్నారు… అదే సమయం లో త్రివిక్రమ్ ఈ ఇయర్ దసరా కి సినిమాను మొదలు పెట్టాలని కూడా భావిస్తున్నట్లు తెలుస్తుంది. కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇప్పట్లో జరిగే అవకాశం తక్కువే అంటున్నారు. కరోనా ఎఫెక్ట్ వలన హీరోలు ఇంకా షూటింగ్స్ కి వెళ్ళలేదు.
మరికొన్ని నెలల టైం పట్టేలా ఉండటంతో ఆ ఇంపాక్ట్ కూడా త్రివిక్రమ్ సినిమా పై పడే అవకాశం ఉంది… దానికి తోడూ త్రివిక్రమ్ సెకెండ్ ఆఫ్ కంప్లీట్ చేసి ఎన్టీఆర్ ని ఒప్పించాల్సి ఉంటుంది. ఇవన్నీ అవ్వడానికి మరో రెండు మూడు నెలల టైం పట్టేలా ఉండగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్…
ఆర్ ఆర్ ఆర్ తర్వాతే మొదలు కాబోతుంది. దాంతో మరో ఏడాది పాటు డిలే అయ్యేలా ఉందని టాక్ కూడా ఉంది. అందుకే త్రివిక్రమ్ ఎన్టీఆర్ కి కంప్లీట్ నరేషన్ ఇచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ మొదలు అయ్యే సమయాన్ని అంచనా వేసుకుని… తన దగ్గర ఉన్న ఇతర కథలలో ఏదైనా ఒక చిన్న కథని ఎంచుకుని…
సినిమా చేద్దామనే ఆలోచనలో ఉన్నారని లేటెస్ట్ టాక్… ఇదంతా ఒకవేళ ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ తర్వాతే షూటింగ్ అంటే ఈ గ్యాప్ లో చేయాలని అనుకుంటున్నారట త్రివిక్రమ్.. అలా కాదు ఆర్ ఆర్ ఆర్ లో తన పార్ట్ షూట్ కంప్లీట్ అవ్వగానే ఈ సినిమా మొదలు అంటే చిన్న సినిమా ను పక్కకు పెట్టేద్దామని అనుకుంటున్నారట… మరి ఫైనల్ గా ఏది డిసైడ్ అవుతారో త్వరలో తెలుస్తుంది…