బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన కన్నడ యాక్టర్ ఉపేంద్ర(Upendra) చాలా టైం తర్వాత డైరెక్ట్ చేసిన యుఐ మూవీ(UI Movie) ఉపేంద్ర డైరెక్షన్ లో చాలా టైం తర్వాత వచ్చిన సినిమా అవ్వడంతో, అంచనాలు సాలిడ్ గా పెరిగిపోయాయి. సినిమా ట్రైలర్ కూడా క్లిక్ అవ్వడంతో…
సినిమా కూడా ఇదే రేంజ్ లో కుమ్ముతుంది అనుకున్నా కూడా సినిమా చూసిన తర్వాత ట్రైలర్ షాట్ మొత్తం సినిమా ఎండ్ లో పెట్టి మిగిలిన కథ మొత్తం అప్ అండ్ డౌన్స్ తో కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ను తికమక పెట్టినా కూడా….
ఆడియన్స్ అసలు సినిమాలో ఏముందో చూద్దాం అని వీకెండ్ లో ఎగబడి థియేటర్స్ కి వెళుతూ ఉండగా వీకెండ్ లో కలెక్షన్స్ కూడా బాగానే వస్తూ ఉన్నా కూడా ఓవరాల్ గా సినిమా కి ఆడియన్స్ నుండి మిక్సుడ్ టాక్ కొనసాగుతూ ఉంది…కానీ ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ లో..
సినిమా మీద ఒక స్ట్రాంగ్ రూమర్ వినిపిస్తుంది…అదేంటంటే క్రిస్టమస్ రోజు కన్నా ముందే సినిమా రీ ఎడిట్ వర్షన్ ను ఆడియన్స్ ముందుకు తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నారట. అంటే సినిమా లో సెకెండ్ ఆఫ్ లో మేజర్ సీన్స్ ను ఫస్టాఫ్ లో పెట్టి…అలాగే ఫస్టాఫ్ లో వచ్చే సీన్స్ ను…
సెకెండ్ ఆఫ్ లో పెట్టి కొంచం స్క్రీన్ ప్లే పరంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి ఆడియన్స్ ముందుకు క్రిస్టమస్ కన్నా ముందు రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తుంది. ఇది కనుక వర్కౌట్ అయితే క్రిస్టమస్ వీక్ లో ఆడియన్స్ నుండి బెటర్ రెస్పాన్స్ సొంతం అయ్యే అవకాశం..
కలెక్షన్స్ పరంగా కూడా సినిమాకి మంచి ఊపు వచ్చే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. సినిమా మీద సాలిడ్ అంచనాలను పెట్టుకుని భారీగా ప్రమోషన్స్ చేస్తున్న ఉపేంద్ర ఈ నిర్ణయం నిజం అయ్యి అనుకున్న అంచనాలను అందుకుంటే కలెక్షన్స్ పరంగా భారీగా హెల్ప్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.