బాక్స్ ఆఫీస్ దగ్గర ఉప్పెన సినిమా మూడో వారాన్ని పూర్తీ చేసుకుంది, సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో మొదటి వారాన్ని రికార్డు బ్రేకింగ్ లెవల్ లో ముగించగా తర్వాత రెండో వారం లో సినిమా సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది, ఇక మూడో వారం లో కూడా సినిమా స్టడీ రన్ నే కొనసాగించినప్పటికీ రెండో వారం తో పొల్చితే మూడో వారం డ్రాప్స్ 60% రేంజ్ లో ఉన్నాయి.
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో 38.41 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా, రెండో వారం లో 8.25 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. ఇక మూడో వారం లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3.46 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది.
మొత్తం మీద 3 వారాల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లెక్క ఇప్పుడు 50 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని ఇండియా లోనే మొదటి సినిమాతో 50 కోట్ల షేర్ ని సొంతం చేసుకున్న మొట్ట మొదటి సినిమా గా సంచలన రికార్డ్ ను నమోదు చేసింది ఉప్పెన సినిమా.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సాధించిన 3 వారాల కలెక్షన్స్ లెక్కను ఒకసారి గమనిస్తే..
👉Nizam: 15.25Cr
👉Ceeded: 7.60Cr
👉UA: 8.39Cr
👉East: 4.95Cr
👉West: 2.57Cr
👉Guntur: 2.90Cr
👉Krishna: 3.08Cr
👉Nellore: 1.71Cr
AP-TG Total:- 46.45CR(76.13Cr Gross~)
Ka+ROI – 2.30Cr Approx(Updated)
Os – 1.37Cr Approx.
Total – 50.12Cr(81.30Cr~ Gross)
ఇదీ సినిమా మొత్తం మీద వరల్డ్ వైడ్ గా 21 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క. సినిమా కలెక్షన్స్ అద్బుతంగా కొనసాగుతూ ఉండగా మూడో వారం తో పోల్చితే 4 వ వారం స్టడీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటే 52 కోట్ల క్లబ్ లో సినిమా చేరే అవకాశం ఉంటుంది.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 21 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 21 రోజుల తర్వాత సాధించిన కలెక్షన్స్ తో సినిమా 29.12 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది అని చెప్పాలి. ఇక నాలుగో వారం లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ప్రదర్శనని చూపుతుందో అన్నది ఆసక్తిగా మారింది.