సినిమా పై హైప్ ని బట్టి మంచి మంచి ఆఫర్లు వస్తూ ఉంటాయి, యూనిట్ సైలెంట్ అయ్యి ప్రమోషన్స్ ఆపేస్తే సినిమా కి బజ్ కూడా తగ్గుతుంది, కరోనా టైం లో సినిమాల బజ్ లు కంటిన్యుగా మెయిన్ టైన్ చేయడం కష్టమే, చాలా సినిమాలు డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకోగా మరి కొన్ని సినిమాలు డైరెక్ట్ రిలీజ్ అవ్వాలో వద్దో అన్న డౌట్ లోనే కరోనా టైం ని మాగ్జిమం….
కంటిన్యూ చేశాయి, అలాంటి సినిమాలలో మెగా ఫ్యామిలీ నుండి హీరోగా లాంచ్ అవుతున్న కొత్త హీరో వైష్ణవ్ తేజ్ నటించిన మొదటి సినిమా ఉప్పెన సినిమా కూడా ఒకటి, సమ్మర్ కానుకగా ఫస్ట్ సినిమాగా రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా వలన పోస్ట్ పోన్ అవుతూ రాగా….
డైరెక్ట్ రిలీజ్ కోసం ఆఫర్లు వచ్చినా కానీ నిర్మాతలు నో చెప్పారు, తర్వాత సినిమా కి రేటు కూడా తగ్గింది, కానీ థియేటర్స్ రీ ఓపెన్ చేశాక రేటు కొంచం పెరగగా రీసెంట్ గా సినిమాలోని మరో పాట ని రిలీజ్ చేయగా ఆ సాంగ్ మంచి హిట్ అవ్వడం తో…
మళ్ళీ సినిమాకి ఊపు వచ్చింది, రిలీజ్ డేట్ ని ఇంకా అనౌన్స్ చేయక పోవడం తో ఇప్పటికీ OTT యాప్స్ తమ లక్ ని పరిక్షీంచుకుంటున్నాయి. రీసెంట్ గా సినిమా కి మళ్ళీ రేటు పెరిగి 18 కోట్ల దాకా ఆఫర్ దక్కగా ఇప్పుడు రేటు మరింత పెరిగి రౌండ్ ఫిగర్ నంబర్స్ ని ఆఫర్ చేస్తున్నారని లేటెస్ట్ ట్రేడ్ టాక్.
సినిమా కోసం 20 కోట్ల రేంజ్ డైరెక్ట్ రిలీజ్ ఆఫర్స్ ని ఇప్పుడు ఇస్తున్నారట. సినిమా బడ్జెట్ డిలే వలన మరింత ఎక్కువ అయిన ఫైనాన్స్ వలన 22 కోట్ల దాకా అయ్యిందట. ఆ లెక్కన చూసుకుంటే 20 కోట్ల ఆఫర్ కొంచం తక్కువే అయినా కానీ ఉన్నంతలో ఇదే బెస్ట్ ఆఫర్ సినిమాకి, కానీ యూనిట్ మాత్రం త్వరలో మంచి డేట్ కి థియేట్రికల్ రిలీజ్ ని కన్ఫాం చేసే అవకాశం ఉందని అంటున్నారు.