Home న్యూస్ ఉప్పెన@220….టాలీవుడ్ తరుపున రికార్డ్ ఇది!!

ఉప్పెన@220….టాలీవుడ్ తరుపున రికార్డ్ ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలను సృష్టించడానికి సిద్ధం అవుతుంది క్రేజీ మూవీ ఉప్పెన. మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా లాంచ్ అవుతున్న ఈ కొత్త సినిమా కోసం ఇప్పుడు టాలీవుడ్ మొత్తం ఆశగా ఎదురు చూస్తుంది, వరల్డ్ వైడ్ గా ఏకంగా 20.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా 21 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగుతూ ఉండగా సినిమా పై క్రేజ్ అంతకంతకు పెరిగి పోతుంది.

సినిమా క్లైమాక్స్ ట్విస్ట్ ఆల్ రెడీ సోషల్ మీడియా లో లీక్ అయినా కానీ అది నిజమా కాదా అన్న ఆసక్తి ఆడియన్స్ లో ఉంది, దాంతో క్రేజ్ మరింతగా పెరిగి పోగా సినిమా సాంగ్స్ కి రెస్పాన్స్ రీసెంట్ టైం లో అల వైకుంఠ పురంలో తర్వాత బెస్ట్ అనిపించే విధంగా ఉండగా…

ఆ క్రేజ్ కి తగ్గ ఓపెనింగ్స్ ని సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉండగా సినిమా ఇక్కడ భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా ఓవర్సీస్ లో కూడా రికార్డ్ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతుంది, పాండమిక్ తర్వాత టాలీవుడ్ తరుపున ఓవర్సీస్ లో…

హైయెస్ట్ లోకేషన్స్ లో థియేటర్స్ లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న సినిమాగా మారనుంది ఉప్పెన సినిమా. ఒక్క అమెరికాలోనే సినిమా ఇప్పుడు 80 కి పైగా లోకేషన్స్ లో రిలీజ్ కాబోతుంది, ఇక ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ లలో సుమారు 110 లోకేషన్స్ లో రిలీజ్ కానుంది. టోటల్ ఓవర్సీస్ లో సినిమా మినిమమ్ 220 వరకు లోకేషన్స్ లో గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతుంది.

ఈ లెక్కన సినిమా కి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఓవర్సీస్ లో సంచలన కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా సినిమా భారీగా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా ఫస్ట్ డే సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here